కరోనాపై పోరులో భాగంగా వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు ప్రపంచ దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. భారత్ కూడా తన వంతు కృషి చేస్తోంది. తాజాగా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడం కోసం అహ్మదాబాద్‌కు చెందిన ఓ ఫార్మా సంస్థతో ఐఐటీ గువహటి(ఐఐటీజీ) కలిసి పనిచేస్తోంది. ఈ విషయాన్ని ఆ ఫార్మా కంపెనీ 'హెస్టర్ బయోసైన్సెస్' బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఐఐటీజీతో ఈ నెల 15న ఒప్పందం కుదిరిందని స్పష్టం చేసింది.
రీకాంబినెంట్ ఏవియన్ పారామైక్సో వైరస్‌కు చెందిన వెక్టర్ ప్లాట్ఫార్మ్ ఆధారంగా వ్యాక్సిన్‌ను రూపొందించనున్నట్టు సంస్థ పేర్కొంది. సార్స్- సీఓవీ-2లోని ఇమ్యునోజెనిక్ ప్రోటీన్లను రూపొందించడానికి ఈ పారామైక్సో ఉపయోగపడుతుంది.