తెలంగాణ

telangana

ఆతిథ్య రంగానికి ఈ ఏడాది రూ.90 వేల కోట్ల నష్టం!

By

Published : Nov 13, 2020, 10:04 PM IST

కరోనా కారణంగా తీవ్రంగా కుదేలైన రంగాల్లో ఆతిథ్య రంగం కూడా ప్రధానమైంది. కొవిడ్ సంక్షోభం వల్ల ఈ రంగానికి 2020లో రూ.90 వేల కోట్ల నష్టం వాటిల్లొచ్చని హెచ్​వీఎస్ ఆనరాక్ నివేదిక అంచనా వేసింది. లాక్​డౌన్ సడలింపుతో ఇప్పుడిప్పుడే ఈ హోటల్​ వ్యాపారాలు రికవరీ దిశగా అడుగులేస్తున్నట్లు వివరించింది.

HOW MUTCHTO LOSE HOTEL BUSINESESS WITH CORONA
కరోనాతో ఆతిథ్య రంగానికి నష్టమెంత

కరోనా వల్ల దాదాపు అని రంగాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. అందులో కొన్ని ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా.. మరికొన్ని ఇంకా కోలుకోవాల్సి ఉంది. ఆతిథ్య రంగం కూడా ఇదే కోవలోకి వస్తుంది. కరోనా వల్ల ప్రయాణాలు తగ్గిపోవటం వంటి కారణాలతో ఆతిథ్య రంగం నెమ్మదిగా కోలుకుంటోంది.

కరోనా వల్ల నెలకొన్న పరిస్థితులతో.. దేశంలోని ఆతిథ్య రంగం 2020లో దాదాపు రూ.90,000 కోట్ల ఆదాయం నష్టపోవచ్చని హెచ్​వీఎస్ ఆనరాక్ నివేదిక అంచనా వేసింది.

ఒక వేళ కరోనా వ్యాక్సిన్ 2021లో అందుబాటులోకి వచ్చి.. ఏడాది చివరి నాటికి పెద్ద ఎత్తున ప్రజలకు అందితే.. ఆతిథ్య రంగం ఆక్యుపెన్సీ, రోజువారీ సగటు రేటు(ఏడీఆర్​) తిరిగి 2022, 2023 నాటికి కొవిడ్ సంక్షోభం ముందున్న స్థాయికి చేరుతాయని అంచనా వేసింది.

పెరుగుతున్న డిమాండ్..

చాలా రోజుల లాక్​డౌన్, వర్క్ ఫ్రమ్ హోమ్ అనంతరం దేశీయంగా ప్రయాణాలు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. దీని వల్ల హోటల్​ వ్యాపారాల్లో ఇటీవల స్వల్ప రికవరీ కనిపిస్తోందని వెల్లడించింది నివేదిక.

'ఇప్పుడిప్పుడే దేశీయ ప్రయాణాలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ ప్రయాణాలపై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో.. చాలా మంది దేశీయంగా ప్రయాణాలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. దీనితో ప్రధాన మార్కెట్లలో హోటల్ ఆక్యుపెన్సీ రేటు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. పర్యటకులు ఎక్కువగా ఇష్టపడే.. గోవా, జైపూర్​లలో ఆక్యుపెన్సీ రేటు ఎక్కువగా ఉంది.' అని నివేదిక వివరించింది.

దేశం మొత్తం మీద హోటళ్ల ఆక్యుపెన్సీ రేటు ఏప్రిల్​లో 10 శాతం నుంచి సెప్టెంబర్ నాటికి 26 శాతానికి పెరిగిందని వెల్లడించింది.

ప్రత్యేక ప్యాకేజీలు..

దేశీయ పర్యటకులను దృష్టిలో ఉంచుకుని చాలా హోటళ్లు, వర్క్ ఫ్రమ్ హోటల్, డే ప్యాకేజీ, ఫుండ్ అండ్ బీవరేజెస్ వంటి ప్యాకేజీలను అందుబాటులో ఉంచాయని నివేదిక వెల్లడించింది. ఇలాంటి ప్రత్యేక ఆఫర్లూ రికవరీకి దోహదం చేసినట్లు పేర్కొంది. అయినప్పటికీ.. ఇంకా ఆతిథ్య రంగ వ్యాపారాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:కరోనాతో భారత్ బ్రాండ్ విలువ 21% డౌన్

ABOUT THE AUTHOR

...view details