తెలంగాణ

telangana

ETV Bharat / business

7.6 లక్షల హోండా కార్ల రీకాల్‌

పలు సాంకేతిక కారణాల దృష్ట్యా హోండా కంపెనీ తన కార్లను రీకాల్​ చేయనుంది. ఫ్యూయల్​ పంపింగ్​లో తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు.. ప్రపంచవ్యాప్తంగా పలు మోడళ్లను రీకాల్​కు పిలుస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుత సమస్యతో ఎటువంటి ప్రమాదాలు జరగనప్పటికీ.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.

Honda recalls over 628,000 US vehicles to replace fuel pumps
7.6లక్షల హోండా కార్ల రీకాల్‌

By

Published : Mar 31, 2021, 10:48 PM IST

జపాన్‌కు చెందిన దిగ్గజ ఆటోమొబైల్‌ సంస్థ హోండా భారీగా కార్లను రీకాల్‌ చేసింది. ఈ కార్లకు వినియోగించిన ఫ్యూయల్‌ పంప్స్‌లో సమస్యలు తలెత్తడంతో వాహనాలను వెనక్కి రప్పిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 7,61,000 వాహనాలను ఈ రీకాల్‌ పరిధిలోకి వస్తాయి. వీటిల్లో హోండాతోపాటు దాని అనుబంధ సంస్థ అక్యూరా వాహనాలు కూడా ఉన్నాయి. 2018 నుంచి 2020 మధ్య తయారైన వాహనాలు వీటిలో ఉన్నాయి. ఈ సమస్య కారణంగా ఎటువంటి ప్రమాదాలు జరగలేదని.. ముందు జాగ్రత్తల్లో భాగంగానే రీకాల్​ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

ఈ మోడళ్లు వెనక్కు..

అకార్డ్‌,సివిక్‌,సీఆర్‌-వీ,ఫిట్‌,పైలట్‌,రిడ్జ్‌లైన్‌,ఎండీఎక్స్‌,ఆర్డీఎక్స్‌,టీఎల్‌ఎక్స్‌ మోడల్‌ కార్లు వీటిలో ఉన్నాయి. గత డిసెంబర్‌లో కూడ సాఫ్ట్‌వేర్‌ సమస్యలు, డ్రైవ్‌ షిఫ్ట్‌ల్లో సమస్యలతో అమెరికాలో దాదాపు 14లక్షల కార్లను హోండా రీకాల్‌ చేసి సమస్యను పరిష్కరించింది. అప్పట్లో కూడా పలు లగ్జరీ మోడళ్లు వీటిలో ఉన్నాయి.

ఇవీ చదవండి:బెంజ్​ కార్లలో లోపం- 6.6 లక్షల యూనిట్లు రీకాల్​

'కియా' ఇంజిన్​లో మంటలు.. 3లక్షల కార్లు వెనక్కి

ABOUT THE AUTHOR

...view details