తెలంగాణ

telangana

ETV Bharat / business

'టెలికాంలో ఆరోగ్యకరమైన పోటీ ఉండాల్సిందే'

దేశంలోని టెలికాం రంగంలో ఆరోగ్యకరమైన పోటీనే కోరుకుంటున్నామని స్పష్టం చేశారు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి రవిశంకర్​ ప్రసాద్​. ఏకచ్ఛత్రాధిపత్యాన్ని ప్రోత్సహించేది లేదని వెల్లడించారు.

'ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి..ఏకఛత్రాధిపత్యం కాదు'

By

Published : Jul 28, 2019, 4:51 AM IST

Updated : Jul 28, 2019, 10:48 AM IST

టెలికాం సంస్థల సీఈవోలు, ప్రతినిధులతో తొలిసారి సమావేశమయ్యారు కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి రవిశంకర్​ ప్రసాద్​. ఈ సందర్భంగా టెలికాం రంగంలో ఆరోగ్యకరమైన పోటీనే ప్రభుత్వం కోరుకుంటోందని ప్రకటించారు. అంతేగానీ ఏకచ్ఛత్రాధిపత్యాన్ని కాదని స్పష్టం చేశారు. వినియోగదారులకు అందించే సేవల్లో నాణ్యత పెంచే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. భారత 5జీ ప్రాజెక్టు, 5 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంలో టెలికాం రంగం ప్రముఖ పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.

భారతీ ఎయిర్​టెల్​ సీఈవో గోపాల్​ విట్టల్​, వొడాఫోన్​-ఐడియా సీఈవో బలేశ్​ శర్మ, రిలయన్స్​ జియో బోర్డు సభ్యులు మహేంద్ర నహట, బీఎస్​ఎన్​ఎస్​ ఛైర్మన్​ పీకే పుర్వార్​లతో దాదాపు గంటపాటు సమావేశమయ్యారు కేంద్ర మంత్రి. టెలికాం వ్యాపారంలో నెలకొన్న సమస్యలను మంత్రికి విన్నవించారు దిగ్గజాలు. సుంకాల తగ్గింపు, ఇన్​పుట్​ ట్యాక్స్​​ క్రెడిట్​ విడుదల వంటి చర్యలతో టెలికాం విభాగానికి సర్కారు పూర్తి స్థాయి మద్దతు ఇస్తుందని భరోసా ఇచ్చారు మంత్రి.

"43 వేల గ్రామాలు నేటికీ టెలికాం సేవలకు దూరంగా ఉన్నాయి. ఏడాదిలోపు ఈ గ్రామాలకు సేవలు ప్రారంభించాలని కోరాం. నా విన్నపం మేరకు అందరికీ టెలికాం సేవలు అందిస్తామని అంగీకరించారు. సంస్థల మధ్య ఆరోగ్యకరమైన పోటీ కావాలి. అంతేకానీ ఎలాంటి ఏకచ్ఛత్రాధిపత్యాన్ని ప్రభుత్వం ప్రోత్సహించదని వారికి స్పష్టం చేశాను. "

- రవిశంకర్​ ప్రసాద్​, సమాచార, ప్రసారాల శాఖ మంత్రి.

అప్పుల్లో టెలికాం సెక్టార్​...

టెలికాం రంగంలో నెలకొన్న పోటీతో... సంస్థలు భారీగా అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. 2016లోవచ్చినరిలయన్స్​ జియో జీవితకాల ఉచిత కాల్స్​, తక్కువ ధరకే డేటా అందించింది. ఫలితంగా విపరీతమైన పోటీ ఏర్పడింది. ఇతర సంస్థలు రేట్లు తగ్గించక తప్పలేదు. దాని ద్వారా లాభాల్లో కోతపడింది. జియోను తట్టుకునేందుకు కొన్ని సంస్థలు జట్టు కట్టాయి.

Last Updated : Jul 28, 2019, 10:48 AM IST

ABOUT THE AUTHOR

...view details