లాక్‌డౌన్ నిబంధనల నుంచి ఈ కామర్స్ (అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఇతర) సంస్థలకు ఏప్రిల్ 20 నుంచి ఇవ్వనున్నట్లు చెప్పిన సడలింపులను కేంద్రం ఉపసంహరించుకుంది. ఈ కామర్స్ సంస్థల ద్వారా అత్యవసరం కాని వస్తువుల విక్రయాలపై నిషేధం కొనసాగనున్నట్లు తాజాగా ప్రకటించింది.
అసలు విషయం ఇది..
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌లో రేపటి నుంచి (ఏప్రిల్ 20) కొన్ని సడలింపులు ఉండనున్నట్లు కేంద్రం ఇటీవల మార్గదర్శకాలు జారీ చేసింది. అందులో.. ఈ కామర్స్ సంస్థలు ఏప్రిల్ 20 నుంచి టీవీలు, ఫ్రిడ్జ్‌లు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, దుస్తులు, స్టేషనరీ సామగ్రి వంటి అత్యవసరం కాని వస్తువులనూ విక్రయించుకోవచ్చి పేర్కొంది.
తాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఆదేశాలు జారీ చేశారు. ఔషధాలు, వైద్య పరికరాలు, ఆహారపదార్థాలు, ఇతర అత్యవసరాల విక్రయాలు యాథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.