తెలంగాణ

telangana

ETV Bharat / business

సెబీ నూతన ఛైర్‌పర్సన్‌గా మాధవి పూరీ బుచ్‌ - సెబీ కొత్త ఛైర్మన్​

SEBI New Chairperson: సెబీ నూతన ఛైర్​పర్సన్​గా మాధవి పూరీ బుచ్‌ను నియమించింది కేంద్రం. ప్రస్తుత ఛైర్మన్‌ అజయ్‌ త్యాగి ఐదేళ్ల పదవీ కాలం సోమవారం ముగుస్తున్న నేపథ్యంలో ఆ బాధ్యతలను మూడేళ్ల పాటు మాధవికి అప్పగించింది.

SEBI new chairperson
SEBI new chairperson

By

Published : Feb 28, 2022, 4:22 PM IST

SEBI New Chairperson: సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్ ఆఫ్‌ ఇండియా(సెబీ)కి.. కేంద్ర ప్రభుత్వం కొత్త ఛైర్​పర్సన్​ను నియమించింది. ప్రస్తుత ఛైర్మన్‌ అజయ్‌ త్యాగి ఐదేళ్ల పదవీ కాలం సోమవారం ముగుస్తున్నందున ఆ బాధ్యతలను సెబీ మాజీ సభ్యురాలు మాధవి పూరీ బుచ్‌కు అప్పగించింది.

కేపిటల్‌ మార్కెటింగ్‌ రెగ్యులేటరీ సంస్థ అయిన సెబీకి ఛైర్‌పర్సన్‌గా ఓ మహిళను నియమించడం ఇదే తొలిసారి కావడం విశేషం. మూడేళ్ల పాటు ఆమె నియామకానికి కేబినెట్‌ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆమోదం తెలిపినట్టు సమాచారం.

ఐసీఐసీఐ బ్యాంకులో తన కెరీర్‌ను ప్రారంభించిన మాధవి.. దాదాపు రెండు దశాబ్దాలపాటు ఆ గ్రూప్‌లో పనిచేశారు. అదే సమయంలో 2009 ఫిబ్రవరి నుంచి 2011 మే మధ్య కాలంలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌కు ఎండీగా, సీఈఓగా కీలక బాధ్యతలు నిర్వహించారు.

ఇదీ చూడండి:ఉక్రెయిన్​- రష్యా చర్చలతో పుంజుకున్న సూచీలు.. సెన్సెక్స్​ 350 ప్లస్​

ABOUT THE AUTHOR

...view details