కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకునేలా ప్రజలను ప్రోత్సహించేందుకు గూగుల్ అసిస్టెంట్ ఓ సరికొత్త పాటను తీసుకొచ్చింది. ఈ పాట ఫన్నీగా ఉండి, అందరినీ ఆకట్టుకునేలా రూపొందించారు. వ్యాక్సిన్లు, అవి సురక్షితం అని తెలిపేలా పాట సాగుతుంది. మహమ్మారిని అరికట్టేందుకు టీకాలు అభివృద్ధి చేసి.. ప్రజలకు అందించిన శాస్త్రవేత్తలను అభినందిస్తూ.. వారిని సూపర్ హీరోలుగా పాటలో పేర్కొన్నారు.
ఈ పాట వినాలంటే...
గూగుల్ వ్యాక్సిన్ పాట వినేలంటే.. మీ ఫోన్లో గూగుల్ అసిస్టెంట్ లేదా స్మార్ట్ డివైస్‌ను వ్యాక్సిన్ సాంగ్ పాడమని అడిగితే సరిపోతుంది. మీ డివైస్‌లోని సెట్టింగ్‌ల ప్రకారం.. గూగుల్ అసిస్టెంట్ ఆడ లేదా మగ గొంతుతో వ్యాక్సిన్ పాట పాడుతుంది.
పాటలో లిరిక్స్ గొప్పగా లేకపోయినా.. వ్యాక్సిన్ తీసుకునేలా ప్రజలను ప్రోత్సహించేలా ఉన్నాయి. టీకా ఘనతను శాస్త్రవేత్తలతో పాటు ఫ్రంట్‌లైన్ వారియర్లకు ఇస్తోంది ఈ పాట.
తమ ఫోన్లు, డివైస్‌లలో గూగుల్ అసిస్టెంట్ కరోనా సాంగ్‌ను విన్న పలువురు నెటిజన్లు ట్విట్టర్ వేదికగా చిన్న వీడియో క్లిప్‌లను పంచుకున్నారు.