ఇటీవల వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు మంగళవారం ఒక్క రోజులోనే భారీగా పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.514 పెరిగి.. రూ.48,847 వద్దకు చేరింది.
రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయంగా పసిడికి పెరిగిన డిమాండ్‌తో.. దేశీయంగా బంగారం ధరలు పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.