అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఏడు సంవత్సరాల గరిష్ఠానికి చేరుకుంది. ఈ ఉదయం ఔన్సు బంగారం ధర 1715.25 డాలర్లు పలికింది. ఏడు సంవత్సరాల క్రితం(డిసెంబర్ 2012)లో పసిడి ధర 1722.20 డాలర్లుగా నమోదైంది. ఆ తర్వాత పుత్తడి ఇంత ధర పలకటం ఇదే తొలిసారి.
బంగారానికి రెక్కలు-ఏడేళ్ల గరిష్ఠానికి ధరలు
కరోనా సంక్షోభంతో బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు పసిడి ధర నేడు ఏడేళ్ల గరిష్ఠం వద్ద 1,715.25 డాలర్లకు చేరింది. ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్తో ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్న నేపథ్యంలో పసిడిపై పెట్టుబడులకే మదుపరులు మొగ్గుచూపుతుండటం ఇందుకు కారణం.
బంగారం ధరలకు రెక్కలు
కరోనా వైరస్ (కొవిడ్-19) వ్యాప్తితో అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలనున్నాయనే భయాందోళనలు చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగారంపై పెట్టుబడే సురక్షితమని భావిస్తున్న మదుపరులు, బులియన్ మార్కెట్కు తమ పెట్టుబడులను తరలిస్తున్నారు. ఈ పరిణామాలతో వివిధ దేశాలలో లాక్‌డౌన్ వంటి ఆంక్షలు అమలులో ఉన్నప్పటికీ.. బంగారం ధర తారస్థాయికి చేరుకుందని పరిశీలకులు తెలిపారు.
ఇదీ చూడండి:లాక్‌డౌన్ ఉన్నా కొత్త కారు కొనుక్కోండిలా...