తెలంగాణ

telangana

ETV Bharat / business

ఏప్రిల్​లో భారీగా పెరిగిన బంగారం దిగుమతులు - తగ్గిన వెండి దిగుమతులు

ఏప్రిల్​ నెలలో బంగారం దిగుమతులు భారీగా పెరిగినట్లు కేంద్ర వాణిజ్య శాఖ తెలిపింది. ఒక్కనెలలోనే పసిడి దిగుమతులు సుమారు 6.3 బిలియన్​ డాలర్లకు చేరినట్లు ప్రకటించింది. దేశీయంగా పుత్తడికి గిరాకీ పుంజుకోవడమే ఇందుకు కారణమని వెల్లడించింది.

Gold import
ఏప్రిల్​ నెలలో భారీగా పెరిగిన బంగారం దిగుమతులు

By

Published : May 16, 2021, 1:20 PM IST

కరెంటు ఖాతా లోటుపై నేరుగా ప్రభావం చూపే బంగారం దిగుమతులు ఏప్రిల్​లో 6.3 బిలియన్‌ డాలర్ల మేర పెరిగాయి. దేశీయంగా గిరాకీ పుంజుకోవడమే దిగుమతులకు ప్రధాన కారణమని కేంద్ర వాణిజ్య శాఖ తెలిపింది.

పసిడి దిగుమతులు పెరిగినప్పటికీ.. వెండి దిగుమతులు 88.53 శాతం తగ్గి.. 11.9 మిలియన్‌ డాలర్లుగా నమోదైంది. గతేడాది ఏప్రిల్​ నెలలో బంగారం ఎగుమతులు 2.83 మిలియన్​ డాలర్లుగా ఉన్నాయి.

గతేడాది 6.76 బిలియన్​ డాలర్లుగా ఉన్న వాణిజ్యలోటు బంగారం దిగుమతుల పెరుగుదలతో ఈ ఏడాది ఏప్రిల్​కి 15.1 బిలియన్‌ డాలర్లకు చేరింది. దేశీయంగా పుత్తడికి పెరుగుతున్న డిమాండ్​ కారణంగా దిగుమతులు పెరుగుతున్నాయని నిపుణులు తెలిపారు. అయితే కరోనా రెండో దశ ప్రభావం వీటిపై కూడా పడిందని చెప్పారు. స్థానికంగా విధించిన లాక్​డౌన్​లతో బంగారం కొనుగోళ్లు మునుపటితో పోల్చితే తగ్గాయని వివరించారు.

ఇదీ చూడండి:అమెజాన్​ ప్రైమ్ నెలవారీ ప్లాన్​, ఫ్రీ ట్రయల్‌ లేనట్లే!

ABOUT THE AUTHOR

...view details