తెలంగాణ

telangana

ETV Bharat / business

స్వల్పంగా పుంజుకున్న బంగారం.. నేటి ధరలు ఇవే - భారత్​లో బంగారం ధర

పసిడి, వెండి ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ. 12 వృద్ధి చెందింది. వెండి కిలోకు రూ.65 పెరిగింది.

GOLD
బంగారం

By

Published : Dec 19, 2019, 4:57 PM IST

బంగారం ధర నేడు స్వల్పంగా పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర నేడు రూ.12 పెరిగి.. రూ.38,804కు చేరింది.

అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్​ లేమి సహా రూపాయి క్షీణించడం వంటి పరిణామాల మధ్య దేశీయంగా పసిడి ధరలు స్తబ్దుగా కొనసాతున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

బంగారంతో పాటే వెండి ధర స్వల్పంగా పుంజుకుంది. కిలో వెండి ధర నేడు రూ.65 (దిల్లీలో) ..పెరిగి రూ.45,485కు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,475.50 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 16.94 డాలర్ల వద్ద ఉంది.

ఇదీ చూడండి:100 బిలియన్​ డాలర్ల క్లబ్​లో హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​

ABOUT THE AUTHOR

...view details