తెలంగాణ

telangana

By

Published : Feb 16, 2020, 2:26 PM IST

Updated : Mar 1, 2020, 12:38 PM IST

ETV Bharat / business

స్టాక్ మార్కెట్లు: అంతర్జాతీయ పరిణామాలే కీలకం

అంతర్జాతీయ పరిణామలే ఈ వారం స్టాక్ మార్కెట్లను ముందుకు నడిపించనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశీయంగా ఈ వారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలు పెద్దగా లేవని నిపుణులు అంటున్నారు.

Global trends to dictate markets
స్టాక్ మార్కెట్​ అంచనాలు

స్టాక్ మార్కెట్లకు ఈ వారం అంతర్జాతీయ పరిణామాలు కీలకం కానున్నాయి. దేశీయంగా 2019-20 మూడో త్రైమాసిక ఫలితాల వెల్లడి దాదాపు ముగింపు దశకు చేరుకుంది. కీలక గణాంకాలు ఇప్పటికే వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ పరిణామాలు, కరోనా వైరస్​ ప్రభావం వంటి వాటిపైనే మదుపరులు దృష్టి సారించే అవకాశముంది.

మహాశివరాత్రి సందర్భంగా ఎక్స్చేంజ్​లకు శుక్రవారం సెలవు. ఈ పరిణామాలన్నింటి నడుమ సూచీలు 'రేంజ్​ బౌండ్'​లో కొనసాగే అవకాశముందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

అంతర్జాతీయంగా చూస్తే గురువారం ఫెడరల్​ ఓపెన్ మార్కెట్​ కమిటీ మినిట్స్​ ఉన్న నేపథ్యంలో దానిపై మదుపరులు దృష్టి సారించొచ్చని అంటున్నారు విశ్లేషకులు.

రూపాయి మారకం విలువ, చమురు ధరల హెచ్చుతగ్గుల వంటివీ మార్కెట్లను ప్రధానంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది.

ఇదీ చూడండి:'అమెరికా కోడి కాలు పెడితే భారత పరిశ్రమ మటాష్'

Last Updated : Mar 1, 2020, 12:38 PM IST

ABOUT THE AUTHOR

...view details