రష్యా సహా ప్రధాన చమురు ఎగుమతి దేశాలు (ఒపెక్ సభ్య దేశాలు) అన్నీ మే, జూన్‌లో తమ ఉత్పత్తిని రోజుకు 10 మిలియన్ బ్యారెల్ల మేర తగ్గించేందుకు అంగీకరించాయి. కరోనా సంక్షోభంతో ముడి చమురు ధరలు రికార్డు స్థాయిలో పడిపోయిన నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నాయి.
అమెరికా సహా మరిన్ని దేశాలు కూడా చమురు మార్కెట్‌ను స్థిరీకరించడానికి... తమ చమురు ఉత్పత్తుల్లో కోత విధించడంపై సమాలోచనలు చేస్తున్నాయి.
ధరలు పుంజుకోవడమే లక్ష్యం
ఒపెక్, భాగస్వామ్య దేశాలు జులై వరకు రోజులు 10 మిలియన్ బ్యారెళ్లు, ఆపై సంవత్సరానికి 8 మిలియన్ బ్యారెళ్ల మేర ఉత్పత్తి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. అలాగే 2021 నుంచి 16 నెలల పాటు రోజుకు 6 మిలియన్ బ్యారెళ్ల మేర చమురు ఉత్పత్తి తగ్గించాలని తీర్మానించాయి.
దారికొచ్చిన మెక్సికో
మొదట్లో ఈ ఒప్పందానికి మెక్సికో అంగీకరించలేదు. రోజుకు లక్ష బ్యారెళ్ల చమురు ఉత్పత్తిని మాత్రమే తగ్గించడానికి వీలవుతుందని తేల్చిచెప్పింది. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడోర్తో చర్చలు జరిపారు. దీనితో మెక్సికో కూడా చమురు ఉత్పత్తి తగ్గింపునకు అంగీకరించింది. అయితే మెక్సికోకు వాటిల్లనున్న నష్టానికి పరిహారంగా అమెరికా 2,50,000 బ్యారెళ్ల ఉత్పత్తిని తగ్గించడానికి అంగీకరించింది.
అపూర్వం