ప్రముఖ విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా షేర్లు శుక్రవారం భారీ నష్టాన్ని నమోదు చేశాయి. 'కంపెనీ షేరు ధర మరీ ఎక్కువగా ఉంది' అంటూ సంస్థ సీఈఓ ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్ ఇందుకు కారణమైంది.
'నా చరాస్థులన్నీ దాదాపు అమ్మేస్తున్నా. చివరకు సొంత ఇల్లు కూడా ఉండకపోవచ్చు' అని మస్క్ వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. లాక్డౌన్ నుంచి వెంటనే ప్రజలకు స్వేచ్ఛను తిరిగివ్వాలని ప్రభుత్వానికి సూచించారు.
మస్క్ చేసిన ఈ ట్వీట్లతో సంస్థ షేరు విలువ 80.56 డాలర్ల నష్టంతో 701.32 డాలర్లకు పడిపోయింది.