తెలంగాణ

telangana

ETV Bharat / business

మార్చి 29న భారత్‌లో ప్రవేశించనున్న డిస్నీ+

డిస్నీ+ మార్చి 29న భారత్​లోకి ప్రవేశించనుంది. స్టార్ ​ఇండియాకు చెందిన హాట్​స్టార్​తో కలిసి వస్తున్నట్లు కంపెనీ సీఈఓ బాబ్ ఇగర్ వెల్లడించారు.

Disney+ to enter India on 29 March
మార్చి 29న భారత్‌లో ప్రవేశించనున్న డిస్నీ ప్లస్​

By

Published : Feb 6, 2020, 9:35 AM IST

Updated : Feb 29, 2020, 9:13 AM IST

వీడియో స్ట్రీమింగ్‌ సేవలను అందించే డిస్నీ+ ఈ ఏడాది మార్చి 29న భారత్‌లోకి ప్రవేశించనుంది. ఈ సంస్థ భారత్‌లో స్టార్‌ ఇండియాకు చెందిన హాట్‌స్టార్‌తో కలిసి వస్తున్నట్లు... కంపెనీ సీఈవో బాబ్‌ ఇగర్‌ వెల్లడించారు.

డిస్నీ+ హాట్‌స్టార్‌

డిస్నీ+ను గత నవంబర్‌లో అమెరికాలో ప్రారంభించారు. ఇప్పటికే స్టార్‌ ఇండియాను డిస్నీ కొనేసిన విషయం తెలిసిందే. గతేడాది మార్చిలో 21 సెంచురీ సంస్థను డిస్నీ కొనుగోలు చేసిన సమయంలోనే స్టార్‌ ఇండియానూ దక్కించుకుంది. ఇప్పుడు దీనిలోని హాట్‌స్టార్‌ పేరును డిస్నీ+ హాట్‌స్టార్‌గా మార్చనున్నారు.

బిలియన్ల సబ్​స్క్రైబర్లు

ప్రస్తుతం డిస్నీ+కు ప్రపంచవ్యాప్తంగా 26.5 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఇది భవిష్యత్‌లో ఇతర కంపెనీలకు బలమైన పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే హాట్‌స్టార్‌కు హెచ్‌బీవోతో ఒప్పందం ఉంది. దీనికి తోడు పలు ఛానళ్లను స్ట్రీమ్‌ చేస్తోంది. దీనిలో ఫ్రీ యూజర్లతో పాటు సబ్‌స్క్రైబ్‌ చేసిన వారూ ఉన్నారు. సబ్‌స్క్రైబ్‌ చేసినవారికి అదనపు కంటెంట్‌ లభిస్తోంది. గతేడాది ఏప్రిల్‌ నాటికి హాట్‌స్టార్‌కు 300 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

ఇదీ చూడండి: ఆర్​బీఐ నియంత్రణలోకి సహకార బ్యాంకులు

Last Updated : Feb 29, 2020, 9:13 AM IST

ABOUT THE AUTHOR

...view details