తెలంగాణ

telangana

By

Published : May 17, 2020, 5:22 PM IST

ETV Bharat / business

దేశంలో 13.6 కోట్ల ఉద్యోగాలకు కరోనా గండం

కరోనా సంక్షోభం, లాక్​డౌన్​లో భారత ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో... 13 కోట్ల 60 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతారని, 12 కోట్ల మంది పేదరికంలోకి జారుకుంటారని ఓ నివేదిక పేర్కొంది. దీనిని అధిగమించాలంటే మేక్​ ఇన్​ ఇండియా 2.0 ప్రారంభించాలని సూచించింది.

COVID-19 could cost 135 mn jobs, push 120 mn people into poverty in India: Report
కరోనా ఎఫెక్ట్: 13.6 కోట్ల ఉద్యోగాలకు గండం

కరోనా ధాటికి భారత ఆర్థిక వ్యవస్థ విలవిలలాడుతున్న నేపథ్యంలో... 13కోట్ల 60లక్షల మంది ఉద్యోగాలు కోల్పోవచ్చని, 12కోట్ల మంది తిరిగి పేదరికంలోకి జారుకునే అవకాశముందని తాజాగా వెలువడిన ఓ నివేదిక పేర్కొంది. ప్రజల ఆదాయం, వ్యయం, పొదుపులపై కూడా ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని వెల్లడించింది.

అంతర్జాతీయ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థ... ఆర్థర్ డి లిటిల్... "ఇండియా: సర్మౌంటింగ్​ ది ఎకనామిక్​ ఛాలెంజెస్​ పోస్డ్​ బై కొవిడ్​-19: ఎ 10-పాయింట్​ ప్రోగ్రామ్​ టు రివైవ్​ అండ్​ పవర్​ ఇండియాస్ పోస్ట్​-కొవిడ్​ ఎకానమీ" పేరుతో ఓ నివేదిక వెలువరించింది.

నిరుద్యోగం, పేదరికం తప్పవ్​...

నివేదిక ప్రకారం.. భారత్​లో నిరుద్యోగం 7.6 శాతం నుంచి 35 శాతానికి పెరగవచ్చు. ఫలితంగా 13 కోట్ల 60 లక్షల ఉద్యోగాలు పోతాయి. దీనితో మొత్తంగా 17 కోట్ల 40 లక్షల మంది నిరుద్యోగులుగా మిగిలిపోతారు. 12 కోట్ల మంది పేదరికంలోకి, 4 కోట్ల మంది తీవ్ర పేదరికంలోకి జారుకుంటారు.

జీడీపీ క్షీణిస్తుంది...

కరోనా సృష్టించిన ఆర్థిక విపత్తు కారణంగా.. భారత్​లో ఉద్యోగ నష్టం, పేదరికం పెరగడం, తలసరి ఆదాయం తగ్గడం జరుగుతుందని నివేదిక పేర్కొంది. ఫలితంగా స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) క్షీణిస్తుందని వివరించింది.

2020-21 ఆర్థిక సంవత్సరంలో 10.8 శాతం ఉన్న జీడీపీ... 2021-22 నాటికి 0.8 శాతానికి మాత్రమే పరిమితం కావచ్చు. మొత్తానికి భారత్ 1 ట్రిలియన్ డాలర్ల మేర నష్టపోవచ్చు."

- బర్నిక్ చిత్రన్ మైత్రా, ఆర్థిర్ డి లిటిల్, ఇండియా దక్షిణాసియా పార్ట్న​ర్ అండ్ సీఈఓ

'5 ట్రిలియన్ డాలర్ల' లక్ష్యం నెరవేరాలంటే...

భారత్​ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న మోదీ కల నెరవేరాలంటే.. తక్షణ ఉద్దీపన, నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టాల్సి ఉంటుందని బర్నిక్ చిత్రన్ సూచించారు. ప్రస్తుతం ప్రధాని మోదీ ప్రకటించిన "ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్" కొత్త విధానానికి మంచి ప్రారంభమని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతానికి ప్రభుత్వం, ఆర్​బీఐ తీసుకున్న ఆర్థిక చర్యలు బాగున్నాయని ప్రశంసించిన నివేదిక.. సరైన సమయానికి సరైన విధాన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.

మేక్ ఇన్ ఇండియా 2.0 ప్రారంభించాలి..

భారత ఆర్థిక వ్యవస్థ పునఃరుద్ధరణ వేగవంతం చేయడానికి 10 పాయింట్ల కార్యక్రమాన్ని నివేదిక సూచించింది. ఇందులో భద్రతా వలయాన్ని ఏర్పరచాలని, చిన్న, మధ్య తరహా వ్యాపారాల మనుగడకు ప్రోత్సాహాలు అందించాలని సూచించింది. అలాగే గ్రామీణ ఆర్థిక వ్యవస్థలకు చేయాతనివ్వాలని, తీవ్ర నష్టాల్లో ఉన్న సంస్థలకు ఉద్దీపనలు అందించాలని పేర్కొంది.

ఆధునిక భారత దేశ నిర్మాణంలో భాగంగా... మేక్ ఇన్ ఇండియా 2.0ను ప్రారంభించాలని నివేదిక సూచించింది. అలాగే డిజిటల్ ఇండియా, ఇన్నోవేషన్ ఇండియాలను వేగవంతం చేయాలంది.

ఇదీ చూడండి:'రెండు నెలల్లో రూ.3,360కోట్ల పీఎఫ్​ ఉపసంహరణ'

ABOUT THE AUTHOR

...view details