కరోనావైరస్ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తోంది. కొన్నాళ్లుగా వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో చాలా సంస్థలు ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు నెలకొన్నాయి.
దేశీయంగా సగానికి పైగా కంపెనీల కార్యకలాపాలపై కరోనా వైరస్ ప్రభావం పడినట్లు ఫిక్కీ నిర్వహించిన సర్వేలో తేలింది. అది కూడా ప్రాథమిక దశలోనేనని తెలిపింది. అలాగే సుమారు 80 శాతం కంపెనీలకు నగదు లభ్యత తగ్గిందని కూడా సర్వే వెల్లడించింది. దీంతో ఉద్యోగులకు జీతాలు, వడ్డీలు, రుణాల చెల్లింపులు చేయలేని పరిస్థితి నెలకొంటోందని పేర్కొంది.