మీరు ఆహార ప్రియులా.. విలాసవంతమైన హోటళ్లలో విశ్రాంతి కోరుకునే వారా అయితే చింతించనవసరం లేదు. మహిళా దినోత్సవం సందర్భంగా ఇవాళ మీ కోసమే ప్రత్యేక ఆఫర్లతో వస్తున్నాయి ప్రముఖ సంస్థలు. షాపింగ్ అంటే మహిళలందరికీ ఇష్టమే. అందుకే అలాంటి వారి కోసం వస్త్ర దుకాణాలు భారీ తగ్గింపు, ఆఫర్లతో సిద్ధమయ్యాయి. విలాసవంతమైన హోటళ్లు, స్పా కేంద్రాలు ఆకర్షణీయమైన ఆఫర్లతో ఊరిస్తున్నాయి. ఇది ఎక్కడో కాదు దేశ రాజధాని దిల్లీలోనే..
బీ అవర్ ఓన్ బీఏఈ
దిల్లీలోని ప్రముఖ షాపింగ్ మాల్స్‌లో ఒకటైన 'పసిఫిక్ మాల్' ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. బీ అవర్ ఓన్ బీఏఈ ప్రచారంతో ముందుకు వచ్చింది. రూ.5000-15000 వరకు షాపింగ్ చేసినట్లయితే.. డైమండ్ గొలుసు గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది. అంతే కాదు ఉచితంగా భోజనం చేసే అవకాశం, కాంప్లిమెంటరీ బ్యూటీ వోచర్లు గెలుచుకునే ఏర్పాట్లు చేసింది. ఈ అవకాశం శనివారం నుంచి మార్చి 15 వరకు ఉంటుందని తెలిపింది.
ఇండియా ఫ్యామిలీ మార్ట్...
దిల్లీలోని రిటైల్ వ్యాపార సంస్థ ఇండియా ఫ్యామిలీ మార్ట్.. దుస్తుల నుంచి గృహోపకరణాల వరకు అనేక రకాల ఉత్పత్తులపై రూ.999 కొనుగోలు చేస్తే రూ.500 విలువైన కూపన్లు ఇస్తోంది.
తమ ఎత్తుకు ఐదు రెట్లు డిస్కౌంట్
ప్రత్యేక వస్త్రాలతో అందరి దృష్టిని ఆకర్శించే కల్పనా వస్త్ర దుకాణం.. శని, ఆదివారాల్లో ప్రత్యేక ఆఫర్లు తీసుకొచ్చింది. వినియోగదారుల ఎత్తుకు 5 రెట్లు డిస్కౌంట్ ఇస్తోంది. అది ఎలాగంటే.. ఉదాహరణకు మీ ఎత్తు 5 అడుగుల 6 అంగుళాలు అనుకుంటే.. 27.5 శాతం డిస్కౌంట్ వస్తుంది.
ఆన్‌లైన్‌లోనూ భారీ డిస్కౌంట్లు..