తెలంగాణ

telangana

ETV Bharat / business

నిరాశపరిచిన భారతీ ఎయిర్‌టెల్‌ - ఎయిర్‌టెల్‌

2019-20 డిసెంబర్ త్రైమాసికంలో భారతీ ఎయిర్‌టెల్‌ రూ.1,035 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏజీఆర్ బకాయిలు చెల్లించడానికి రూ.28,450 కోట్లు కేటాయించడమే ఇంత భారీగా నష్టం ప్రకటించడానికి కారణం.

Bharti Airtel reported a net loss of Rs 1,035 crore in the December quarter.
నిరాశపరిచిన భారతీ ఎయిర్‌టెల్‌

By

Published : Feb 5, 2020, 8:08 AM IST

Updated : Feb 29, 2020, 5:53 AM IST

భారతీ ఎయిర్‌టెల్‌ 2019-20 డిసెంబరు త్రైమాసికంలో రూ.1,035 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో సంస్థ రూ.86 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కంపెనీ ఆదాయం రూ.20,231 కోట్ల నుంచి 8.5 శాతం వృద్ధి చెంది రూ.21,947 కోట్లకు చేరింది.

ఎయిర్​టెల్ గత డిసెంబరులో టారిఫ్‌ల సవరణ స్వాగతించదగ్గ పరిణామం. ఇది టెలికాం పరిశ్రమ ఆర్థిక పరిస్థితుల్ని మెరుగుపరుస్తుంది. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల్లో పెట్టుబడులు పెట్టడానికి వీలుగా టారిఫ్‌లు మరింత పెంచాల్సిన అవసరం ఉంద’ని భారతీ ఎయిర్‌టెల్‌ ఇండియా, దక్షిణాసియా ఎండీ, సీఈఓ గోపాల్‌ విత్తల్‌ వెల్లడించారు.

భారతీ ఎయిర్‌టెల్‌ ఇండియా ఆదాయం 7 శాతం పెరిగి రూ.15,797 కోట్లకు చేరినట్లు కంపెనీ ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది. ఇదిలా ఉంటే, ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఎయిర్‌టెల్‌ ఏకంగా రూ.23,045 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన సవరించిన స్థూల ఆదాయాలకు (ఏజీఆర్‌) సంబంధించిన చట్టబద్ధమైన బకాయిల కోసం రూ.28,450 కోట్ల కేటాయింపులు చేయడం వల్లే అంత భారీగా నష్టం ప్రకటించాల్సి వచ్చింది.

ఇదీ చూడండి: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 'కరోనా' దెబ్బ

Last Updated : Feb 29, 2020, 5:53 AM IST

ABOUT THE AUTHOR

...view details