తెలంగాణ

telangana

ETV Bharat / business

'సంక్షోభంతో వ్యయాల కోత దిశగా ఆటో పరిశ్రమ' - వ్యయాల తగ్గింపు దిశగా ఆటో రంగం

గత 12 నుంచి 18 నెలలుగా దేశీయంగా వాహన రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీనికి తోడు ఇప్పుడు కరోనా సంక్షోభం తెలెత్తింది. ఈ నేపథ్యంలో ఖర్చులు తగ్గించుకునేందుకు ఆటో పరిశ్రమ ఆర్​&డీ వ్యయాల కోత విధించే దిశగా అడుగులు వేస్తున్నట్లు డెలాయిట్ నివేదిక వెల్లడించింది.

auto sector ready to cut spendings
వ్యయాల కోత దిశగా ఆటోరంగం

By

Published : May 9, 2020, 9:49 AM IST

లాక్‌డౌన్‌తో తీవ్రంగా నష్టపోయిన దేశీయ ఆటో పరిశ్రమ పరిశోధనా, అభివృద్ధి(ఆర్​ అండ్​ డీ)పై వ్యయాలను తగ్గించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. లాభదాయతలేని విభాగాలకు స్వస్తి పలకాలని కూడా భావిస్తున్నట్లు డెలాయిట్ నివేదిక అంచనా వేసింది.

ఆర్ అండ్ డీ కార్యక్రమాల్లో తగ్గుదల ఇప్పటివరకూ ప్రత్యామ్నాయ ఇంధన సాంకేతికతలపై జరిగిన పరిశోధనపై బాగా ప్రభావం చూపొచ్చని నివేదిక వెల్లడించింది. గత 12 నుంచి 18 నెలలుగా భారత్‌లో ఆటో పరిశ్రమ వృద్ధి బాగా మందగించింది. జీఎస్​టీ, బీఎస్​-4 నుంచి బీఎస్​6కు మారడం, నగదు లభ్యత వంటి అంశాలు ఆటో పరిశ్రమపై ప్రభావం చూపాయి. దేశీయ ఆటో పరిశ్రమ కోలుకోవాలంటే చాలా సమయంపట్టే అవకాశముందని డెలాయిట్ నివేదిక పేర్కొంది.

2018-19లో జరిగిన వాహన అమ్మకాలు.. మళ్లీ 2021-22లోనే నమోదయ్యే అవకాశముందని తెలిపింది. లాక్‌డౌన్ తర్వాత డీలర్లు తమ వద్ద ఉన్న వాహనాలకు భారీ రాయితీలు ఇచ్చి వదిలించుకునే ప్రణాళికలుక వేయొచ్చని డెలాయిట్‌ పేర్కొంది. రూ.6,300 కోట్ల విలువైన బీఎస్​-4 వాహనాలు డీలర్ల వద్ద ఉన్నాయి. వీటికి రాయితీలు ఇచ్చేందుకు తయారీ కంపెనీలు కూడా డీలర్లకు మద్దతిచ్చే అవకాశముందని డెలాయిట్ వెల్లడించింది.

ఇదీ చూడండి:కరోనా తర్వాత ఆన్​లైన్​లో కార్ల విక్రయాల జోరు!

ABOUT THE AUTHOR

...view details