తెలంగాణ

telangana

ETV Bharat / business

చైనా యాపిల్ స్టోర్​ నుంచి 47వేల అప్లికేషన్లు డిలీట్ - 47 యాప్​లు డిలీట్ చేసిన యాపిల్

యాపిల్ సంస్థ చైనాలోని యాప్​ స్టోర్​ నుంచి 47 వేల అప్లికేషన్లను తొలగించింది. అక్కడి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విధివిధానాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ది ఇన్ఫర్మేషన్ అనే వార్తా సంస్థ తెలిపింది. అమెరికాలో టిక్​టాక్, వీచాట్​కు వ్యతిరేకంగా ట్రంప్ చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఈ సంస్థకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొంది.

Apple removes 47K apps from Chinese App Store: Report
చైనా యాపిల్ స్టోర్​ నుంచి 47వేల అప్లికేషన్లు డిలీట్

By

Published : Aug 19, 2020, 8:41 PM IST

యాపిల్ సంస్థ కనీసం 47 వేల అప్లికేషన్లను చైనాలోని తమ యాప్​ స్టోర్​ నుంచి తొలగించింది. చైనా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇదివరకు యాపిల్ సంస్థ బయటపెట్టిన లొసుగులను తొలగించేందుకు చైనా ప్రయత్నిస్తోందని.. ఇందులో భాగంగానే వేలాది యాప్​లను చైనీస్ స్టోర్​ల నుంచి తీసివేస్తోందని ది ఇన్ఫర్మేషన్ అనే వార్తా సంస్థ కథనం రాసుకొచ్చింది.

"ప్రభుత్వ లైసెన్సులు, చైనాలో స్థానిక భాగస్వాములు లేకుండానే యాప్​ స్టోర్ సహా ఇతర సేవలను యాపిల్ నిర్వహిస్తోంది. అమెరికాలో టిక్​టాక్, వీచాట్​కు వ్యతిరేకంగా ట్రంప్ చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఈ సంస్థకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి."

-ది ఇన్ఫర్మేషన్

ప్రభుత్వ అంతర్జాల విధివిధానాలకు అనుగుణంగా గత నెలలో 4,500 గేమ్స్​ను యాపిల్ చైనాలోని తన యాప్​స్టోర్​ నుంచి డిలీట్ చేసింది.

యాపిల్ యాప్​ స్టోర్ మార్కెట్​కు చైనా అతిపెద్ద వనరు. ఏడాదికి 16.4 బిలియన్ డాలర్ల ఆదాయం​ యాపిల్​కు సమకూరుతోంది. అమెరికాలో ఆదాయం 15.4 బిలియన్ డాలర్లుగా ఉండటం గమనార్హం. ప్రస్తుతం చైనాలోని యాపిల్ యాప్​ స్టోర్​లో దాదాపు 60 వేల గేమ్స్​ ఉన్నట్లు అంచనా.

బైట్​డాన్స్​(టిక్​టాక్), టెన్సెంట్(వీచాట్)​ సంస్థలపై ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం వల్ల ఇరుదేశాల మధ్య కొత్త వైరుధ్యాలు మొదలయ్యాయి. చైనాకు చెందిన హువావే సంస్థపైనా అమెరికా ఆంక్షలు విధించింది.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details