'ప్రైమ్ వీడియో ఛానల్స్'ను(prime video channels) దేశంలో ఆందుబాటులోకి తీసుకొచ్చింది అమెజాన్(amazon india). దీంతో డిస్కవరీ ప్లస్, ఈరోస్ నౌ వంటి ఛానల్స్.. ఒకే వేదికపైకి చేరాయి.
అమెజాన్.. ప్రైమ్ వీడియో ఛానల్స్ తీసుకొచ్చిన దేశాల్లో 12వది భారత్. ఇప్పటికే వివిధ రకాల కంటెంట్‌ను అందిస్తోంది ప్రైమ్.. తాజా ప్రకటనతో అనేక ఛానల్స్‌ను 'యాడ్ఆన్ సబ్స్క్రిప్షన్స్'గా యూజర్స్‌కు అందుబాటులోకి తీసుకొచ్చింది. అంటే.. ఎవరైనా యాడ్ఆన్ ఆప్షన్‌ను ఎంచుకుంటే, వారికి ఆమెజాన్ ప్రైమ్‌లోనే ఆయా ఛానల్స్ కంటెంట్ కనపడుతుంది.
"10 భాషల్లో యూజర్స్‌కు వినోదం అందించేందుకు నాలుగేళ్లుగా మేము కృషి చేస్తూనే ఉన్నాము. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అసలుసిసలైన కంటెంట్‌ను ప్రేక్షకులకు అందుబాటులోకి తెస్తున్నాము. ప్రైమ్ వీడియో ఛానల్‌ను దేశంలో ప్రవేశపెట్టడం ద్వారా.. భారతీయ ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందిస్తున్నాము."
--- గౌరవ్ గాంధీ, అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా మేనేజర్.