భారతదేశంలో చిన్న, మధ్యతరహా వ్యాపారాలను డిజిటలైజ్ చేయడం కోసం 1 బిలియన్ డాలర్లు (సుమారు రూ.7,000 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ తెలిపారు.
2025 నాటికి 10 బిలియన్ డాలర్ల విలువైన మేక్ ఇన్ ఇండియా వస్తువులను ఎగుమతి చేయడానికి కంపెనీ నిశ్చయించిందని స్పష్టం చేశారు బెజోస్. ఇందుకు ప్రపంచవ్యాప్తంగా తమకున్న వ్యాపార అనుభవం ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.
దిల్లీలో నిర్వహించిన అమెజాన్ ఎస్ఎమ్భవ్ సదస్సులో బెజోస్ పాల్గొన్నారు. భారత్లోని చిన్న, మధ్యతరహా వ్యాపారాలకు ఎలా సాంకేతికతను అనుసంధానం చేయాలనే అంశంపై ఈ సదస్సు దృష్టిసారించనుందని పేర్కొన్నారు.