తెలంగాణ

telangana

ETV Bharat / business

మే ఆఖరుకు 4 కోట్ల మంది చేతిలో మొబైళ్లుండవ్‌! - mobile phones news

లాక్​డౌన్ కారణంగా మే ఆఖరు నాటికి దాదాపు 4కోట్ల మంది మొబైల్​ ఫోన్ల వినియోగానికి దూరమయ్యే అవకాశముందని ఐసీఈఏ వెల్లడించింది. మొబైల్ హ్యాండ్​సెట్​, విడిభాగాల అమ్మకాలపై నిషేధం కారణంగా ఇప్పటికే 2.5కోట్ల మంది మొబైళ్లు పనిచేయక ఇబ్బంది పడుతున్నారని పేర్కొంది.

4 cr users may be without mobile phones
లాక్​డౌన్ వల్ల 4కోట్లమంది చేతిలో మొబైళ్లుండవ్‌!

By

Published : Apr 25, 2020, 5:37 AM IST

Updated : Apr 25, 2020, 7:02 AM IST

మొబైల్‌ హ్యాండ్‌సెట్‌, విడి భాగాల అమ్మకాలపై ఇలానే నిషేధం కొనసాగితే మే నెలాఖరు నాటికి 4 కోట్ల మంది వినియోగదారుల వద్ద మొబైల్‌ హ్యాండ్‌ సెట్లు ఉండబోవని ఓ అంచనా. ఇదివరకే వారి వద్ద ఉన్న మొబైళ్లు పాడైపోవడం, ఆగిపోవడం వంటి సమస్యల వల్ల ఈ విధంగా జరిగే అవకాశముందని ఇండియన్‌ సెల్యులర్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ అసోసియేషన్‌ (ఐసీఈఏ) పేర్కొంది. ఇప్పటికే 2.5 కోట్ల మంది తమ మొబైల్‌ ఫోన్లు సరిగా పనిచేయక, కొత్త ఫోన్లు కొనలేక, విడిభాగాలు దొరక్క ఇబ్బంది పడుతున్నారని పేర్కొంది.

లాక్‌డౌన్‌ వేళ కేవలం నిత్యావసరాల విక్రయాలకు మాత్రమే అనుమతి ఉంది. మొబైల్‌, విడిభాగాల అమ్మకాలపై నిషేధం అమలవుతోంది. ఈ నేపథ్యంలో యాపిల్‌, ఫాక్స్‌కాన్‌, షావోమి వంటి కంపెనీలు సభ్యులుగా ఉన్న ఐసీఈఏ వీటి అమ్మకాలపై నిషేధం ఎత్తివేయాలని కోరుతోంది. ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినట్లు తెలిపింది.

దేశంలో ప్రతి నెలా 2.5 కోట్ల కొత్త మొబైళ్ల అమ్మకాలు జరుగుతాయని ఐసీఈఏ తెలిపింది. ప్రస్తుతం దేశంలో 85 కోట్ల మంది మొబైల్‌ వినియోగదారులు ఉన్నారని, ఇందులో కనీసం 0.25 మంది మొబైల్‌ సరిగా పనిచేయక ఇబ్బంది పడుతున్నారని పేర్కొంది. ఈ లెక్కన 2.5 కోట్ల మంది కొత్త మొబైళ్లు దొరక్క, పాత వాటిని రిపేర్‌ చేయించుకోలేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. ఏప్రిల్‌ 20 నుంచి ఆన్‌లైన్‌లో మొబైళ్లు, టీవీలు, ఫ్రిజ్‌లు విక్రయాలకు తొలుత అనుమతి ఇచ్చినప్పటికీ ఒక్కరోజు ముందు ఈ నిర్ణయాన్ని కేంద్ర హోం శాఖ వెనక్కి తీసుకుంది.

ఇదీ చూడండి: ఐఫోన్ 'ఎస్​ఈ ప్లస్'​ విడుదల ఆలస్యం!

Last Updated : Apr 25, 2020, 7:02 AM IST

ABOUT THE AUTHOR

...view details