తెలంగాణ

telangana

ETV Bharat / briefs

వివాదాస్పదమైన థరూర్ ట్వీట్​.. జాలర్ల ఆగ్రహం​ - fish

తిరువనంతపురం చేపల మార్కెట్​ పర్యటన గురించి కాంగ్రెస్​ ఎంపీ శశిథరూర్​ చేసిన ట్వీట్​ వివాదాస్పదమైంది. థరూర్​ తమను కించపరిచేలా ట్వీట్​ చేశారని... వెంటనే క్షమాపణ చెప్పాలని జాలర్లు ర్యాలీ చేశారు. తాను ట్వీట్లో వాడిన పదాలను వక్రీకరించారని వివరణ ఇచ్చారు థరూర్​.

వివాదాస్పదమైన థరూర్ ట్వీట్

By

Published : Mar 30, 2019, 9:16 PM IST

కేరళ రాజధాని తిరువనంతపురం నుంచి రెండుసార్లు లోక్​సభకు ఎన్నికైన కాంగ్రెస్​ నేత శశిథరూర్​ వివాదంలో చిక్కుకున్నారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరువనంతపురం చేపల మార్కెట్​ను ఇటీవల సందర్శించారు థరూర్​. తన పర్యటనపై మార్కెట్​లోని కొన్ని ఫోటోలను జతచేస్తూ ట్వీట్​ చేశారు.

వివాదాస్పదమైన థరూర్ ట్వీట్

" శాకాహారినైన నేను, మాంసమంటే అసహ్యించుకునే నాకు చేపల మార్కెట్​లో ఎంతో ఉత్సాహం కలిగింది"

- శశిథరూర్​ ట్వీట్​

థరూర్​ ట్వీట్​పై జాలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను కించపరిచేలా పదజాలాన్ని ఉపయోగించారని కొచ్చి, కోజికోడ్​​​, కొల్లాం ప్రాంతాల్లో ర్యాలీలు చేపట్టారు. గతేడాది ఆగస్టులో వచ్చిన వరదల్లో రాష్ట్రంలోని ఎంతోమంది ప్రాణాలను కాపాడింది తామేనని జాలర్లు గుర్తు చేశారు. అలాంటి తమను అవమానించినందుకు ​ క్షమాపణ చెప్పాలని థరూర్​ను డిమాండ్​ చేశారు.

శశిథరూర్​ ట్వీట్​పై భాజపా, సీపీఎం నాయకులు విమర్శలు చేశారు. జాలర్ల మనోభావాలను ఆయన దెబ్బతీశారని వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

శశిథరూర్​ స్పందన

తన ట్వీట్​పై చెలరేగిన దుమారంపై శశిథరూర్​ స్పందించారు. ట్వీట్​లోతాను వినియోగించిన పదాలను వక్రీకరించారని అన్నారు.

" మాంసమంటే అసహ్యించుకునే శాకాహారిగా నన్ను నేను పరిగణించుకొని హాస్యం పుట్టించాను. అంతేకానీ, ఎవరినీ కించపరచాలన్న ఉద్దేశం లేదు. నేను శాకాహారిని అయినప్పటికీ చేపలు విక్రయిస్తున్న ఓ మహిళ నాపై ఎంతో ఆప్యాయత చూపించారు. ఈ విషయాన్నే నా ట్వీట్​తో చెప్పాలనుకున్నా. నా కుటుంబంలో నేను తప్ప అందరూ చేపలు తింటారు."

- శశిథరూర్​, కాంగ్రెస్​ నేత, తిరువనంతపురం ఎంపీ

ABOUT THE AUTHOR

...view details