తెరాస అభ్యర్థులందరినీ గెలిపించాలని కోరారు చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్. పెద్దపల్లి లోక్‌సభ గులాబీ పార్టీ అభ్యర్థి బోర్లకుంట వెంకటేశ్ నేతకానికి మద్దతుగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. గతంలో తాను ఎంపీగా కేంద్రంతో కొట్లాడి తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో గోదావరి, ప్రాణహిత నదులపై వంతెనలను మంజూరు చేయించానని సుమన్ తెలిపారు. 16 మంది ఎంపీలను గెలిపిస్తే రాష్ట్రానికి కావలసిన నిధులను సాధించుకోవచ్చన్నారు.
పదహారు గెలిస్తే రాష్ట్రానికి కావల్సిన నిధులు - mp
పదహారు స్థానాలు గెలిస్తే రాష్ట్రానికి కావల్సిన నిధులను సాధించుకోవచ్చని చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. కేసీఆర్ ప్రధాని అయ్యే అవకాశాలున్నాయని జోస్యం చెప్పారు.
చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్