తెలంగాణ

telangana

ETV Bharat / briefs

'తీవ్రవాదులను ఉక్కుపాదంతో అణిచివేస్తున్నాం' - ప్రసంగం

ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించి వేసేందుకు కృషి చేస్తున్నామన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రస్తుతం కశ్మీర్​లోని రెండున్నర జిల్లాలకే ఉగ్రవాదం పరిమితమైందని చెప్పారు. గుజరాత్​లోని అమ్రేలిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు మోదీ. ప్రపంచంలోనే ఎత్తయిన సర్దార్​ వల్లభాయ్​ పటేల్​ విగ్రహాన్ని నిర్మించింది.. మాజీ ప్రధాని జవహర్​ లాల్​ నెహ్రూను తక్కువ చేసేందుకు కాదన్నారు ప్రధాని.

నరేంద్ర మోదీ

By

Published : Apr 18, 2019, 2:33 PM IST

Updated : Apr 18, 2019, 3:44 PM IST

గుజరాత్​లోని అమ్రేలిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం

ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపామన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. దేశంలో ఇప్పుడు కేవలం జమ్ము కశ్మీర్​లోని రెండున్నర జిల్లాల్లోనే ఉగ్రజాడలు ఉన్నాయని చెప్పారు. ఐదేళ్లలో అక్కడ తప్ప దేశంలో మరెక్కడా బాంబు దాడులు జరగలేదన్నారు. గుజరాత్​లోని అమ్రేలిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ ప్రసంగించారు.

కాంగ్రెస్​ వల్లే 40ఏళ్లు ఆలస్యం

గతంలో రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్​ వల్లే సర్దార్​ సరోవర్​ డ్యాం నిర్మాణం 40ఏళ్లు ఆలస్యమైందని ఆరోపించారు నరేంద్ర మోదీ. అప్పట్లోనే ఆ ప్రాజెక్టు పూర్తయి ఉంటే గుజరాత్​ పరిస్థితి మరింత మెరుగ్గా ఉండేదన్నారు. తాము వచ్చాక ఈ డ్యాం నిర్మాణాన్ని పూర్తి చేశామని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించామన్నారు.

అధికారం కోసం కాంగ్రెస్ కలలు

స్వాతంత్ర్యం వచ్చాక కాంగ్రెస్​కు అతి తక్కువ లోక్​సభ స్థానాలు వచ్చింది 2104లోనే అని మోదీ గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లోనేమో తక్కువ స్థానాల్లో పోటీ చేస్తూ.. అధికారంలోకి వస్తామని కాంగ్రెస్​ నేతలు కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.

ప్రపంచంలోనే ఎత్తయిన సర్దార్​ పటేల్​ ఐక్యతా విగ్రహాన్ని గుజరాత్​లో ఏర్పాటు చేసింది మాజీ ప్రధాని జవహర్​ లాల్​ నెహ్రూను అగౌరవపరిచేందుకు కాదని స్పష్టం చేశారు ప్రధాని మోదీ.

ఇది ఎన్నికల ర్యాలీ కాదు

"ఇది నాకు ఎన్నికల ర్యాలీ కాదు. గుజరాత్​ ప్రజలకు ధన్యవాదాలు తెలిపే వేదికగా భావిస్తున్నా. విశేషంగా ఆదరిస్తున్న అందరికీ ధన్యవాదాలు"

- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

Last Updated : Apr 18, 2019, 3:44 PM IST

ABOUT THE AUTHOR

...view details