రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా 'ఆర్.ఆర్.ఆర్'. ప్రస్తుతం పుణెలో షూటింగ్ జరుపుకుంటోంది. ఇంట్లో జిమ్ వర్కవుట్స్ చేస్తుండగా హీరో రాంచరణ్‌కు గాయమైంది. మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చరణ్‌కు సూచించారు. ఫలితంగా.. అతడికి సంబంధించిన షెడ్యూల్‌ను వాయిదా వేసింది చిత్రబృందం.
చరణ్‌కు గాయం..'ఆర్ఆర్ఆర్' షూటింగ్‌కు బ్రేక్ - RAJA MOULI
హీరో రాంచరణ్ జిమ్‌లో కఠోరసాధన చేస్తుండగా గాయమైంది. 'ఆర్.ఆర్.ఆర్'లో అతడికి సంబంధించిన షెడ్యూల్ మూడు వారాలు వాయిదా పడింది.
జిమ్ వర్కవుట్స్ చేస్తుండగా రాంచరణ్‌కు గాయం
ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్, కుమ్రం భీం పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఆలియా భట్, డైసీ ఎడ్గర్ జోన్స్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. అజయ్ దేవగణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జులై 30న విడుదలకానుంది.
ఇవీ చదవండి:
Last Updated : Apr 3, 2019, 6:13 PM IST