తెలంగాణ

telangana

ETV Bharat / briefs

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రహానేకు జరిమానా

ఐపీఎల్​లో మరోసారి స్లో ఓవర్ రేట్ నమోదైంది. ఈ కారణంగా రాజస్థాన్ రాయల్స్​ కెప్టెన్ రహానేకు రూ.12 లక్షల జరిమానా విధించింది ఐపీఎల్​ యాజమాన్యం.

రాజస్థాన్ కెప్టెన్ అజింక్య రహానే

By

Published : Apr 1, 2019, 11:47 AM IST

ఐపీఎల్​లో మరో కెప్టెన్​పై స్లో ఓవర్ రేటు కారణంగా జరిమానా విధించారు. ఆదివారం మ్యాచ్​లో.. నెమ్మదిగా బౌలింగ్ చేయించిన కారణంగా రాజస్థాన్ కెప్టెన్ రహానేకు రూ.12 లక్షల ఫైన్ వేసింది ఐపీఎల్ యాజమాన్యం. చెన్నైతో జరిగిన ఈ పోరు​లో 8 పరుగుల తేడాతో రాయల్స్ ఓటమి పాలైంది. 75 పరుగులు చేసిన ధోని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్​గా నిలిచాడు.

ఇది చదవండి:ఐపీఎల్​లో స్లో ఓవర్ రేటు- రోహిత్​కు ఫైన్

రాజస్థాన్ రాయల్స్​ తొలి తప్పిదంగా భావించి జట్టు కెప్టెన్ రహానేకు రూ.12 లక్షల జరిమానా విధించాం -ఐపీఎల్ యాజమాన్యం

తర్వాతి మ్యాచ్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సొంతగడ్డపై తలపడనుంది రాజస్థాన్.

శనివారం పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ స్లో ఓవర్ రేట్ నమోదు చేశాడు. అతడికీ రూ.12 లక్షల జరిమానా విధించింది ఐపీఎల్.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details