హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి లేఖ రాశారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో జరిగిన చిన్నారి అత్యాచార ఘటనలో నిందితున్ని సత్వరమే శిక్షించేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. అభంశుభం తెలియని చిన్నారిపై నిందితుడు వ్యవహరించిన తీరు అత్యంత దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. తొమ్మిది నెలల పాపపై అఘాయిత్యానికి పాల్పడ్డ నరరూప రాక్షసునికి వెంటనే కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని పోచంపెల్లి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
హైకోర్టు ప్రధానన్యాయమూర్తికి పోచంపల్లి లేఖ - COURT
వరంగల్‌లో జరిగిన అత్యంత అమానుష ఘటనలో నిందితునికి వెంటనే కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. దానికోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు పోచంపల్లి.
MLC POCHAMPALLY SRINIVAS REDDY WROTE A LETTER TO HIGH COURT JUDGE FOR ARRANGE FAST TRACK COURT