తెలంగాణ

telangana

ETV Bharat / briefs

సాయంత్రం నాలుగు వరకే ఎన్నికలు: కలెక్టర్‌ - BHARATHI HOLI

మంచిర్యాల జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు. ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్​ భారతి హోళీ కేరి తెలిపారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటు వేయాలని సూచించారు.

మంచిర్యాలలో సాయంత్రం వరకే ఎన్నికలు

By

Published : Apr 10, 2019, 8:34 PM IST

మంచిర్యాల జిల్లాలోని 724 పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రిని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో పంపిణీ చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం నాలుగు వరకు ఎన్నికలు జరుగుతాయని కలెక్టర్ భారతి హోళీ కేరి తెలిపారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఓటర్లు వడదెబ్బకు గురికాకుండా మజ్జిగ పంపిణీ చేస్తామని అన్నారు. జిల్లాలో 3,300 మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని... పోలింగ్​కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు.

భద్రత కట్టుదిట్టం

జిల్లాలో 307 సమస్యాత్మకమైనవి, 98 మావోయిస్ట్​ ప్రభావిత పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు రామగుండం పోలీసు కమిషనర్​ సత్యనారాయణ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. మావోయిస్టుల కదలికలు ఎక్కడా లేవని... ముందస్తుగా ప్రత్యేక పోలీసు బలగాలు మోహరించినట్లు సీపీ వెల్లడించారు.

మంచిర్యాలలో సాయంత్రం వరకే ఎన్నికలు

ఇవీ చూడండి: రేపు చింతమడకలో ఓటు వేయనున్న కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details