బాలికను వేధిస్తున్న కౌన్సిలర్ భర్త - undefined
పెళ్లై ఇంట్లో భార్య ఉన్నప్పటికీ... ఇంకో బాలికపై కన్నేశాడు. తనను పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించాడు. బాలిక అతని వేధింపులు భరించలేక.. పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బాలికను వేేధిస్తున్న కౌన్సిలర్ భర్త
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో ఓ వార్డు కౌన్సిలర్ భర్త శ్రీనివాస్ తనను వేధిస్తున్నట్లు అదే వార్డుకు చెందిన స్థానిక బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు పోలీసులు నిందితుడు శ్రీనివాస్‌పై పోక్సోచట్టం, 506,509సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. శ్రీనివాస్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.
Last Updated : May 19, 2019, 6:16 PM IST
TAGGED:
HARRASMENT