తెలంగాణ

telangana

ETV Bharat / briefs

జీహెచ్​ఎంసీ అధికారుల ఆకస్మిక పర్యటన - జీహెచ్​ఎంసీ అధికారుల ఆకస్మిక పర్యవేక్షణ

జీహెచ్​ఎంసీ ఫరిదిలో వస్తున్న ఫిర్యాదుల దృష్ట్యా... అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ... పనులను పరిశీలించారు. ఆక్రమణలకు పాల్పడుతున్న వారికి నోటీసులు జారీచేశారు.

ఆకస్మిక తనిఖీలు

By

Published : Jun 14, 2019, 3:11 PM IST

హైదరాబాద్​ పాతబస్తీలో పురపాలనశాఖప్రిన్సిపల్​ సెక్రటరీ అరవింద్,జీహెచ్​ఎంసీ కమిషనర్​ దానకిశోర్​ పర్యటించారు. చార్మినార్​ లాడ్​ బజార్​ నుంచి ముర్గి చౌక్​ క్లాక్​ టవర్​, కిల్వత్​ మీదుగా జరిగే రోడ్​ వెడల్పు పనులను పర్యవేక్షించారు. అంతకు ముందు రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ పరిధిలోని భౌంరుక్ దౌల చెరువు ఆక్రమణకు గురవుతుందన్న ఫిర్యాదు మేరకు ఆకస్మిక తనిఖీ చేశారు. పర్యటనలో హైదరాబాద్​ ఎంపీ అసదుద్దీన్​ ఓవైసీ, సౌత్​ జోన్​ కమిషనర్ హరిచందన, జిల్లా కలెక్టర్ లోకేష్​కుమార్ పాల్గొన్నారు. రాజేంద్రనగర్​లోని రాఘవేంద్ర కాలనీలో 25 ప్లాట్లు, ఇళ్లు ఎఫ్​టీఎల్​లో ఉన్నాయని అధికారులు గుర్తించి నోటీసులు జారీ చేశారు. గతంలో ఇళ్ల నిర్మాణం కోసం మున్సిపల్ అధికారులు, హెచ్ఎండీఏ అధికారులు అనుమతులు ఇచ్చారని కాలనీవాసులు తెలిపారు. ఇప్పటివరకు అధికారులు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని వాపోయారు.

ఆకస్మిక తనిఖీలు

ABOUT THE AUTHOR

...view details