ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు అడుగడుగునా కొత్త ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే భద్రతను తగ్గించిన ప్రభుత్వం... గన్నవరం విమానాశ్రయం లోనికి ఆయన వాహన శ్రేణిని అనుమతించలేదు.విమానాశ్రయంలో చంద్రబాబుకు సాధారణ ప్రయాణికుడిలా తనిఖీలు నిర్వహించారు. లాంజ్ నుంచి విమానం వరకు తెదేపా అధినేత బస్‌లోనే ప్రయాణించారు. జెడ్‌ప్లస్ భద్రతలో ఉన్నా.. ఆయనకు ప్రత్యేక వాహనం కేటాయించలేదు. రాష్ట్రంలోనూ చంద్రబాబు కాన్వాయ్‌కి పైలెట్ క్లియరెన్స్ తొలగించారు. ఈ పరిణామాలపై తెదేపా వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ట్రాఫిక్‌లో చంద్రబాబు వాహనం ఆగితే... భద్రతపరంగా శ్రేయస్సు కాదంటున్నాయి.
ఏపీ మాజీ ముఖ్యమంత్రి... సాధారణ ప్రయాణికుడా...! - ఏపీ మాజీ ముఖ్యమంత్రి
తెదేపా అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వాహనాన్ని భద్రతా సిబ్బంది విమానాశ్రయంలోనికి అనుమతించలేదు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లడానికి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న చంద్రబాబును... భద్రతా సిబ్బంది సామాన్య ప్రయాణికుడి తరహాలో తనిఖీలు చేశారు.
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు