సరస్వతి అనుగ్రహం లేకపోతే బంగారు తెలంగాణ ఎలా సాధ్యమో సీఎం కేసీఆర్ జవాబివ్వాలని ఎన్సీపీసీఆర్ మాజీ ఛైర్ పర్సన్ ఆచార్య శాంతాసిన్హా ప్రశ్నించారు. విద్యా సామర్థ్యాల సాధన కోసం హైదరాబాద్లో నిర్వహించిన తల్లుల సదస్సులో సరస్వతి తాండవం చేసేందుకు తల్లులు సిద్ధంగా ఉన్నారని..వారిని కేసీఆర్ ఎదుర్కొగలరా అని సవాల్ విసిరారు. అందరికీ సమాన విద్యను అందించే విధంగా ప్రభుత్వం విద్యా హక్కు చట్టాన్ని పటిష్ఠంగా అమలు పరచాలని కోరారు.
డబ్బున్నోళ్లకు ఒక విద్య, పేదవారికి మరో విద్య అనే వ్యత్యాసాలు ఉండకూడదని స్పష్టం చేశారు. బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించకపోతే అనతి కాలంలోనే 10 కోట్ల మంది పిల్లలు నిరక్షరాస్యులుగా మిగిలిపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల చదువుల కోసం కష్టపడే తల్లులు వారికి నాణ్యమైన విద్యను అందించేందుకు పోరాటాలకు సమాయత్తం కావాలని సూచించారు.
'ఉన్నోళ్లకు లేనోళ్లకు ఒకే రకమైన విద్యనందించాలి'
రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పటిష్ఠ పరచాలని..విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జాతీయ బాలల హక్కుల కమిషన్ మాజీ ఛైర్ పర్సన్ ఆచార్య శాంతాసిన్హా డిమాండ్ చేశారు. విద్యా సామర్థ్యాలు అందించే ప్రక్రియను పర్యవేక్షించడానికి స్వయం ప్రతిపత్తి గల కమిషన్ను ఏర్పాటు చేయాలన్నారు.
విద్యా సమస్యలు పరిష్కరించకపోతే పోరాటాలకు సిద్ధం కావాలి : శాంతాసిన్హా
ఇవీ చూడండి : ఫోన్ మాట్లాడవద్దన్నందుకు యువతి ఆత్మహత్య