తెలంగాణ

telangana

ETV Bharat / briefs

నేటితో ముగియనున్న ఎంసెట్ పరీక్షలు

నేటితో ఎంసెట్ పరీక్షలు ముగియనున్నాయి. ఈ నెల 11న విద్యార్థులకు ప్రశ్నాపత్రాలను, ప్రాథమిక సమాధానాలను పంపించాలని అధికారులు నిర్ణయించారు.

By

Published : May 9, 2019, 5:42 AM IST

నేటితో ముగియనున్న ఎంసెట్ పరీక్షలు

ఎంసెట్ పరీక్షలు నేటితో ముగియనున్నాయి. ఆన్​లైన్ ప్రశ్నపత్రాలతో పాటు... ప్రాథమిక సమాధానాలను ఈనెల 11న విద్యార్థులకు పంపించాలని అధికారులు నిర్ణయించారు. ఈ నెల 3, 4, 6 తేదీల్లో ఇంజినీరింగ్, నిన్న ఫార్మా, అగ్రికల్చర్ ఆన్​లైన్ పరీక్షలు పూర్తయ్యాయి. ఇవాళ ఉదయం ఫార్మా, వ్యవసాయ పరీక్షతో ఎంసెట్ ముగియనుంది.

ఇంజినీరింగ్​ పరీక్షకు లక్షా 31 వేల మంది విద్యార్థులు హాజరు కాగా... నిన్నటి ఫార్మా, వ్యవసాయ ప్రవేశ పరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా 91.5శాతంతో 45 వేల 660 మంది విద్యార్థులు రాశారు. ఎంసెట్ ఆన్​లైన్​లో నిర్వహించినందున... సమాధానాలను విశ్లేషించుకోవడానికి విద్యార్థులకు ఈనెల 11న ప్రశ్నాపత్రాలను మెయిల్ ద్వారా పంపించనున్నారు. వాటికి సంబంధించిన ప్రాథమిక కీ కూడా అదే రోజు పంపిస్తారు. విద్యార్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత తుది కీ ఖరారు చేస్తారు.

నేటితో ముగియనున్న ఎంసెట్ పరీక్షలు

ఇవీ చూడండి: పనామా చోరీ రాంజీ గ్యాంగ్ పనేనా?

ABOUT THE AUTHOR

...view details