తెలంగాణ

telangana

By

Published : Apr 21, 2019, 2:07 AM IST

ETV Bharat / briefs

సీఎం రమేశ్​ మేనల్లుడు ధర్మరామ్​ ఆత్మహత్య

పరీక్ష తప్పాడనే మనస్తాపంతో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజ్యసభ సభ్యుడు, సీఎం రమేశ్​ మేనల్లుడు ధర్మరామ్​... ఇంటర్​లో ఫెయిలయ్యాననే బాధతో ఓ భవనంపై నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు.

ఇంటర్​లో ఫెయిలయ్యాననే బాధతో

ఇంటర్​లో ఫెయిలయ్యాననే బాధతో

ఇంటర్మీడియట్ పరీక్షలు తప్పాననే మనస్తాపంతో తెదేపా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ మేనల్లుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీనగర్ కాలనీలో ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసముండే రమేశ్ మేనల్లుడు ధర్మరామ్ అమీర్‌పేట్​ నారాయణ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. గణిత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించకపోవడం వల్ల మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. తన తండ్రికి, సోదరికి మెసేజ్ పెట్టి ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్ర గాయాలపాలైన ధర్మరామ్​ను యశోద ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details