ఆదిలాబాద్ జిల్లా మావల మండలంలోని న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. డీఎస్పీ నర్సింహారెడ్డి సారథ్యంలో 80 మంది పోలీసులతో సోదాలు నిర్వహించారు. నేరాలు, దొంగతనాల నివారణకు నిర్బంధ తనిఖీలు చేపడుతున్నట్లు డీఎస్పీ తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు. సరైన ధ్రువపత్రాలు లేని 25 ద్విచక్రవాహనాలు, రెండు ఆటోలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. వాహనాలకు సంబంధించి పత్రాలు చూపిస్తే తిరిగి ఇస్తామని స్పష్టం చేశారు.
న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్బంధ తనిఖీలు - ఆదిలాబాద్
ఆదిలాబాద్ జిల్లా మావల మండలంలోని న్యూహౌజింగ్ బోర్డు కాలనీలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 25 ద్విచక్రవాహనాలు, రెండు ఆటోలు, ఓ కారు స్వాధీనం చేసుకున్నారు.
నిర్బంధ తనిఖీలు