లాక్డౌన్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ.. తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. అతడికి సంబంధించిన విషయాల్ని, భార్య సాక్షి సింగ్ పోస్ట్ చేస్తునే ఉంది. ఈ క్రమంలోనే మహీ కుమార్తె జీవా ఇన్స్టాలో పంచుకున్న ఓ ఫొటో.. నెటిజెన్లను హత్తుకుంటోంది. గాయపడిన ఓ పక్షిని తన తల్లిదండ్రులు కాపాడారని, చెబుతూ ఆ చిత్రాన్ని పోస్ట్ చేసింది.
"ఈ రోజు సాయంత్రం గార్డెన్లో ఓ పక్షి అపస్మారక స్థితిలో ఉన్నట్లు చూశా. వెంటనే అమ్మా, నాన్న పిలిచా. నాన్న వచ్చి ఆ పక్షిని చేతిలోకి తీసుకొని నీరు తాగించారు. కొంతసేపటి తర్వాత పక్షి కళ్లు తెరిచింది. మాకు ఎంతో సంతోషం వేసింది. పక్షిని బుట్టపైన అమర్చిన ఆకులో ఉంచాం. దీన్ని 'క్రిమ్సన్-బ్రెస్ట్ బార్బెట్' అని పిలుస్తారని అమ్మ చెప్పింది. 'కాపర్స్మిత్' అని కూడా అంటారట. ఎంతో అందంగా ఉందో చూడండి ఈ బుజ్జి పక్షి"
--జీవా, ధోని కుమార్తె