తెలంగాణ

telangana

ETV Bharat / briefs

పాన్​​ కార్డు అనుసంధానానికి గడువు పెంపు - AADHAR

ఆధార్​-పాన్​​ కార్డు అనుసంధానానికి ప్రభుత్వం మరోసారి గడువు పెంచింది. ఈ ప్రక్రియను సెప్టెంబరు 30 లోపు పూర్తి చేయాలని సూచించింది.

పాన్​​ కార్డు అనుసంధానానికి గడువు పెంపు

By

Published : Apr 1, 2019, 6:48 AM IST

ఆధార్​-పాన్​ కార్డు అనుసంధానంపై ప్రభుత్వం మరోసారి గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబరు 30ని తుది గడువుగా ప్రకటించింది. ఈ ప్రక్రియకు గడువు పెంచడం ఇది ఆరోసారి.

గతేడాది జూన్​లో ఆధార్​-పాన్​ అనుసంధానానికి మార్చి 31ని తుది గడువుగా ప్రకటించింది. అయితే మరోసారి అవకాశమిస్తున్నట్లు సీబీడీటీ (కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు)తెలిపింది. ఆధార్​తో అనుసంధానించని పాన్​ కార్డులు గడువు పూర్తయితే చెల్లవని పునరుద్ఘాటించింది.

ABOUT THE AUTHOR

...view details