బంగాల్లో ఆరోదశ ఎన్నికలు పటిష్ఠ భద్రత నడుమ ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే బారులు తీరారు.
పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన జనం సాంకేతిక సమస్యతో ఆలస్యం
కరోనా వ్యాప్తి కొనసాగుతున్న వేళ.. వైరస్ నిబంధనలు పాటిస్తూ ఎంతో ఉత్సాహంగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే ఉత్తర్ దినాజ్‌పుర్ జిల్లాలోని 134వ పోలింగ్ కేంద్రం వద్ద సాంకేతిక సమస్య వల్ల ఓటింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది.
భౌతిక దూరం పాటిస్తూ.. ఓటింగ్‌కు ఓటర్లకు థర్మల్ స్క్రీనింగ్ ఓటు వేసిన ప్రముఖులు
ఆరోవిడత పోలింగ్‌లో ప్రముఖులు పాల్గొన్నారు. భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్ తన ఓటు హక్కు వినియోగించారు. భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు అర్జున్ సింగ్, ఆయన కుమారుడు పవన్ సింగ్..144 పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. మరోవైపు తన ఓటు హక్కును వినియోగించుకున్న రాయ్‌గంజ్ భాజపా అభ్యర్థి కృష్ణ కల్యాణ్.. పోలింగ్‌లో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.
పటిష్ఠ భద్రత
గడిచిన దశల్లో జరిగిన చెదురుమదురు ఘటనల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతను అధికారులు ఏర్పాటు చేశారు. ఉత్తర దినాజ్‌పుర్, ఉత్తర 24 పరగణాలు, కట్వా, పూర్వ వర్ధమాన్ జిల్లాల్లోని 43 స్థానాల్లో జరుగుతున్న పోలింగ్‌ను డ్రోన్ల సాయంతో పర్యవేక్షిస్తున్నారు.