తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎగ్జిట్​ పోల్స్​: బంగాల్​లో టీఎంసీదే హవా!

జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించిన బంగాల్‌ శాసనసభ ఎన్నికలకు సంబంధించి సర్వే సంస్థలు ఎగ్జిట్‌ ​ ఫలితాలను ప్రకటించాయి. అందులో 4 సంస్థలు తృణమూల్‌ ​ కాంగ్రెస్​(టీఎంసీ) మూడోసారి అధికారం.. నిలబెట్టుకుంటుందని పేర్కొన్నాయి. రిపబ్లిక్‌ టీవీ-సీఎన్​ఎక్స్​, జన్‌కీ బాత్‌ మాత్రం భాజపా కూటమి అధికారం చేపడుతుందని అంచనా వేశాయి.

west bengal Assembly elections exit polls results
బంగాల్​ ఎగ్జిట్​ పోల్స్​

By

Published : Apr 29, 2021, 8:49 PM IST

బంగాల్‌లో భాజపా కూటమి 138-148 స్థానాలు గెలుపొందుతుందని రిపబ్లిక్‌ టీవీ-సీఎన్​ఎక్స్​ ఎగ్జిట్‌ ఫలితాలను విడుదల చేశాయి. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌.. 128నుంచి 138స్థానాలు కైవసం చేసుకుంటుందని అంచనా వేశాయి. వామపక్షాలు 11 నుంచి 21 స్థానాలు గెలిచే అవకాశం ఉందని రిపబ్లిక్‌ టీవీ-సీఎన్​ఎక్స్​ ఎగ్జిట్‌ ఫలితాలు ప్రకటించాయి..

ఈటీవీ భారత్​ సర్వే

జన్​కీ బాత్​..

బంగాల్‌లో భాజపా కూటమి 165-185 స్థానాలను కైవసం చేసుకుంటుందని జన్‌కీ బాత్‌.. ఎగ్జిట్‌ ఫలితాలను ప్రకటించింది. అధికార తృణమూల్‌ 121 నుంచి 104 సీట్లు గెలుపొందుతుందని పేర్కొంది. వామపక్షాలు 9 నుంచి 3 నియోజకవర్గాల్లో ఆధిక్యం సాధిస్తాయని జనక్‌ బాత్‌ ఎగ్జిట్‌ ఫలితాల్లో అంచనా వేసింది.

టైమ్స్​ నౌ-సీఓటర్​..

తృణమూల్‌ కాంగ్రెస్‌ 158 స్థానాలు గెలుపొందుతుందని టైమ్స్‌ నౌ-సీ ఓటర్‌.. ఎగ్జిట్‌ ఫలితాలను విడుదల చేసింది. భాజపా 115 స్థానాల్లో విజయం సాధిస్తుందని, కాంగ్రెస్‌, వామపక్షాలు, ఐఎస్​ఎఫ్​ కలిసి 76 సీట్లు కైవసం చేసుకుంటాయని అంచనా వేసింది.

ఈటీజీ రీసెర్చ్​..

తృణమూల్‌ కాంగ్రెస్‌ 164 నుంచి 176 నియోజకవర్గాల్లో గెలుపొందుతుందని ఈటీజీ రీసెర్చ్‌-ఎగ్జిట్‌ ఫలితాలను విడుదల చేసింది. భాజపా 105 నుంచి 115 స్థానాలను, వామపక్షాలు 10 నుంచి 15 సీట్లను కైవసం చేసుకుంటాయని అంచనా వేసింది..

పీ-మార్క్​..

మమతా బెనర్జీ సారథ్యంలోని అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ 152 నుంచి 172 స్థానాలు గెలుపొందుతుందని పీ-మార్క్‌ ఎగ్జిట్‌ ఫలితాలను విడుదల చేసింది. భాజపా 112 నుంచి 132 సీట్లు, లెఫ్ట్‌ పార్టీలు 10 నుంచి 20 నియోజకవర్గాలు కైవసం చేసుకుంటాయని ఫలితాలు ప్రకటించింది.

ఏపీపీ-సీ ఓటర్..​

బంగాల్‌లో అధికార టీఎంసీ 152 నుంచి 164 స్థానాలను కైవసం చేసుకుంటుందని ఏబీపీ-సీ ఓటర్‌ ఎగ్జిట్‌ ఫలితాలను విడుదల చేసింది. భాజపా 109 నుంచి 121నియోజకవర్గాల్లో , లెఫ్ట్‌ పార్టీలు 14 నుంచి 25 సెగ్మెంట్లు గెలుపొందుతాయని అంచనా వేసింది.

ఇదీ చూడండి:'ఈసీ పరిశీలకుల తీరుపై సుప్రీం కోర్టుకు వెళ్తా'ఇదీ చూడండి:'అధికార మార్పిడి కాదు.. అభివృద్ధే లక్ష్యం'

ABOUT THE AUTHOR

...view details