తెలంగాణ

telangana

By

Published : Mar 8, 2021, 1:21 PM IST

ETV Bharat / bharat

భారత్​-పాక్ సరిహద్దు గస్తీలో మహిళా జవాన్లు

రాజస్థాన్​లోని శ్రీగంగానగర్​ ఆర్మీ సెక్టార్​లో 50మంది మహిళా సైనికులు సరిహద్దు రక్షణలో నిమగ్నమయ్యారు. దేశ రక్షణకు తాము సైతం అంటూ రాత్రీ పగలూ విధులు నిర్వహిస్తున్నారు. పురుషులతో సమానంగా గస్తీ కాస్తూ ఔరా అనిపిస్తున్నారు.

WATCH: BSF deploys 50 women in guarding border in Rajasthan
సరిహద్దులో నిత్య సంఘర్షణ.. భద్రతలో మహిళా జవాన్లు

సరిహద్దులో నిత్య సంఘర్షణ.. భద్రతలో మహిళా జవాన్లు

సైన్యం అంటే సాధారణంగా పురుషులే అధికంగా ఉంటారు. అయితే మారుతోన్న పరిస్థితుల నేపథ్యంలో మహిళలు సైతం పురుషులకు దీటుగా సైన్యంలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. రాజస్థాన్​లోని సరిహద్దు భద్రతా దళంలో సేవలందిస్తోన్న మహిళా జవాన్లే ఇందుకు నిదర్శనం.

రాజస్థాన్​లో​ భారత్​-పాక్​ సరిహద్దు శ్రీగంగానగర్​ సెక్టార్​లో మహిళా జవాన్లే విధులు నిర్వహిస్తున్నారు. 210 కి.మీ పొడవైన ఈ సరిహద్దు ప్రాంతంలో కనీసం 50మంది మహిళా జవాన్లు గస్తీ కాస్తున్నారు. మహిళా అధికారులే పర్యవేక్షణ విధులు నిర్వహించడం విశేషం.

నిత్యం సవాళ్లతో నిండిన సున్నిత ప్రాంతంలో ప్రతి రోజూ విధి నిర్వహణలో పాల్గొంటున్న ఈ మహిళా జవాన్లు సరిహద్దు విధులకు నియామకం అవ్వడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:సవాళ్లను స్వీకరించే మహిళా.. నీకు వందనం

ABOUT THE AUTHOR

...view details