భారత రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) మరో క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని ఛాంద్పూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ఐటీఆర్) కేంద్రంలో వర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టూ ఎయిర్ మిసైల్(వీఎల్-ఎస్ఆర్ఎస్ఏఎం)ను ఉపరితలం నుంచి గగనతంలోకి రెండుసార్లు విజయవంతంగా ప్రయోగించింది.
వర్టికల్ రేంజ్ క్షిపణి ప్రయోగం విజయవంతం
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అధునాతన వీఎల్-ఎస్ఆర్ఎస్ఏఎం క్షిపణిని శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించారు. ఉపరితలం నుంచి ప్రయోగించిన ఈ మిస్సైల్ నిర్దేశిత లక్ష్యాలను ఛేదించినట్లు అధికారులు వెల్లడించారు.
రెండుసార్లు విజయవంతంగా క్షిపణి పరీక్ష
ఈ క్షిపణి సకాలంలో కచ్చితమైన లక్ష్యాలను ఛేదించినట్లు అధికారులు తెలిపారు. కొత్తగా పరీక్షించిన ఈ క్షిపణి... శత్రుదేశాల దాడులను నిలువరించగలదని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఇదీ చూడండి:'డీఆర్డీఓలో ఉద్యోగుల కొరత.. చర్యలు అవసరం'