Virtual Hearing Supreme Court: దేశంలో కరోనా కేసుల పెరుగుదలతో శుక్రవారం నుంచి అన్ని రకాల కేసుల్లో విచారణను వర్చువల్లోనే నిర్వహించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. జనవరి 7 నుంచి న్యాయమూర్తులు తమ సొంత కార్యాలయాల నుంచే విధులను నిర్వర్తిస్తారని సర్క్యులర్లో పేర్కొంది. చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వం వహించిన ధర్మాసనం ఈ మేరకు గురువారం స్పష్టం చేసింది.
"దురదృష్టవశాత్తు కరోనా సమస్య మళ్లీ మొదలైంది. అందరం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మరో ఆరు వారాల వరకు భౌతిక పద్దతిలో విచారణ జరిపే పరిస్థితులు కనిపించడం లేదు."