తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉత్తరాఖండ్​ హిమపాతానికి 26 మంది బలి.. మరో ముగ్గురి కోసం గాలింపు - ఉత్తరాఖండ్​ హిమపాతం

ఉత్తరాఖండ్​ హిమపాతంలో మరణించిన వారి సంఖ్య 26కు చేరింది. శుక్రవారం సహాయక బృందాలు మరో 10 మృతదేహాలు వెలికితీశాయి.

Uttarkashi avalanche
ఉత్తరాఖండ్​ హిమపాతం

By

Published : Oct 7, 2022, 4:24 PM IST

ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకున్న భారీ హిమపాతంలో మృతుల సంఖ్య 26కు చేరింది. శుక్రవారం మరో 10 మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి. నెహ్రూ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మౌంటనీరింగ్‌ సంస్థ ఈ విషయం వెల్లడించింది. మరో ముగ్గురి జాడ తెలియాల్సి ఉంది. మృతుల్లో 24 మంది ట్రెయినీ పర్వతారోహకులుకాగా, మరో ఇద్దరు వారికి శిక్షణ ఇస్తున్న వారు.

ద్రౌపదీ కా డాండా-2 పర్వత శిఖరం అధిరోహించి వారంతా తిరిగి వస్తుండగా మంగళవారం ఉదయం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ట్రెయినీ పర్వతారోహకుల్లో బంగాల్‌, దిల్లీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, అసోం, హరియాణా, గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు. మృతదేహాలు అన్నింటికీ గుర్తింపు ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు.

ABOUT THE AUTHOR

...view details