తెలంగాణ

telangana

By

Published : Jul 17, 2021, 3:54 PM IST

ETV Bharat / bharat

'సచివాలయంలో ఉద్యోగులు జీన్స్, టీ షర్ట్​ ధరించడం నిషేధం'

సచివాలయంలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది జీన్స్, టీ షర్ట్స్ ధరించకూడదు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు ఉత్తర్​ప్రదేశ్​ సచివాలయం జాయింట్ సెక్రటరీ నరేంద్ర కుమార్ మిశ్రా. గౌరవప్రదమైన దుస్తుల్లోనే వారు రావాలని స్పష్టం చేశారు.

jeans banned
జీన్స్, టీషర్ట్స్, నిషేధం

ఉత్తర్​ప్రదేశ్​ సచివాలయంలో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందిపై పలు ఆంక్షలు విధించింది ప్రభుత్వం. సచివాలయంలో ఇక మీదట జీన్స్, టీ షర్ట్స్ ధరించడాన్ని నిషేధిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సచివాలయం జాయింట్ సెక్రటరీ నరేంద్ర కుమార్ మిశ్రా ఆదేశాలు జారీ చేశారు. గౌరవప్రదమైన దుస్తుల్లోనే వారు కార్యాలయానికి రావాలని ఆదేశాలు జారీ చేశారు.

అసెంబ్లీకి కొన్ని సంప్రదాయాలు ఉన్నాయని మిశ్రా జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో విధులు నిర్వహించే భద్రతా సిబ్బంది, ఇతర అధికారులకు డ్రెస్​కోడ్ ఉందని తెలిపారు. ఈ మేరకు సచివాలయం ఉద్యోగులు కూడా అదే పద్ధతిలో గౌరవప్రదమైన దుస్తులు ధరించాలని ఆదేశించారు.

దాదాపు 400 మంది ఉద్యోగులు ఉత్తర్​ప్రదేశ్​ సచివాలయంలో విధులు నిర్వహిస్తున్నారు.

ఇదీ చదవండి:ప్రభుత్వ ఉద్యోగులు జీన్స్​, టీ షర్ట్స్​ ధరించటం నిషేధం!

ABOUT THE AUTHOR

...view details