తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కుంభమేళా: భక్తులతో కిక్కిరిసిన హరిద్వార్​

కుంభమేళాలో భాగంగా ఉత్తరాఖండ్​ హరిద్వార్​లోని 'హర్ ​కీ పౌడీ' ఘాట్​లో మూడో షాహీ స్నానాలు చేశారు భక్తులు. దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్న వేళ.. భక్తులు లక్షల సంఖ్యలో పవిత్ర గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరించరించటంపై ఆందోళన వ్యక్తం చేశారు అధికారులు.

third shshi snan
భక్తుల మూడో షాహీ స్నానాలు

By

Published : Apr 14, 2021, 10:39 AM IST

Updated : Apr 14, 2021, 10:52 AM IST

కుంభమేళా సందర్భంగా ఉత్తరాఖండ్ హరిద్వార్​లోని హర్​ కీ పౌరీ ఘాట్​ భక్తులతో కిక్కిరిసిపోయింది. లక్షల సంఖ్యలో భక్తులు, సాధువులు పవిత్ర గంగానదిలో మూడో షాహీ స్నానాలు ఆచరించారు. ఈ ఏడాది హరిద్వార్​లో మొత్తం నాలుగు షాహీ స్నానాలు, తొమ్మిది గంగా స్నానాలు నిర్వహించనున్నారు. కరోనా వేళ భక్తులు లక్షల సంఖ్యలో హాజరుకావటంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గంగానదిలో భక్తుల పుణ్య స్నానాలు
మూడో షాహీ స్నానాలు చేస్తున్న సాధువులు
భక్తుల షాహీ స్నానాలు
భక్తుల పవిత్ర స్నానాలు
హర్​ కీ పౌడీ ఘాట్​లో స్నానాలు
ఘాట్​లో కిటకిటలాడుతున్న భక్తులు
భక్తుల మూడో షాహీ స్నానాలు

మొదటి షాహీ స్నానాలు మార్చి 11న మహాశివరాత్రి సందర్భంగా ముగిశాయి. ఏప్రిల్​ 12న రెండో షాహీ స్నానాలు పూర్తయ్యాయి. ఉత్తరాఖండ్​లో మంగళవారం కొత్తగా 1,925 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 9,353 క్రియాశీల కేసులు ఉన్నాయి.

Last Updated : Apr 14, 2021, 10:52 AM IST

ABOUT THE AUTHOR

...view details