రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ గోపాల్ దాస్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితిలో సంతృప్తికర మెరుగుదల కనిపించిందని మేదాంత ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆయన అనారోగ్యంతో నెలరోజులుగా అక్కడ చికిత్స పొందుతున్నారు.
"మహంత్ నృత్య గోపాల్‌దాస్.. ఆరోగ్య పరిస్థితిలో మెరుగుదల కనిపించింది. ఆయనను బుధవారం డిశ్చార్జి చేశాం."