తెలంగాణ

telangana

By

Published : Jun 12, 2022, 10:17 AM IST

ETV Bharat / bharat

ఆకులపై జాతీయ గీతం.. యువతి టాలెంట్​కు రికార్డులు దాసోహం

లీఫ్ ఆర్ట్​తో విభిన్న కళాకృతులను రూపొందిస్తుంది ఓ విద్యార్థిని. ఒక్కరోజులోనే ఆకులతో జాతీయ గీతాన్ని తీర్చిదిద్దింది. ఫలితంగా ఇండియా బుక్​ ఆఫ్ రికార్డ్​లో చోటు సంపాదించింది. అసలు ఆమె ఎవరో తెలుసుకుందామా..?

National Anthem Carved on Leaf
ఆకులతో జాతీయ గీతం చిత్రీకరణ

ఆకులపై జాతీయ గీతం

మన జాతీయ గీతానికి అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ఈ గేయాన్ని ఆకులపై చెక్కి అరుదైన ఘనత సాధించింది ఓ విద్యార్థిని. సాధారణ రైతు కుమార్తె అయిన ఆమె.. తన అద్భుత కళా నైపుణ్యంతో ఇండియా బుక్​ ఆఫ్ రికార్డ్​లో చోటు సంపాదించింది. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో సిద్దాపుర్​కు చెందిన తృప్తి మంజునాథ ప్రస్తుతం బీఈడీ చదువుతోంది.

కళాకృతులతో తృప్తి మంజునాథ

తృప్తి మంజునాథ.. వ్యవసాయ కుటుంబానికి చెందిన అమ్మాయి. కార్వారాలోని బాదా శివాజి ఇంజనీరింగ్ కళాశాలలో బీఈడీ రెండో సంవత్సరం చదువుతోంది. ఆమెకు మొదటి నుంచి లీఫ్ ఆర్ట్స్​పై ప్రత్యేక ఆసక్తి ఉంది. ఈ ఏడాది మే 19న జాతీయ గీతాన్ని ఆకులపై హిందీలో తీర్చిదిద్దింది.

ఆకులపై చెక్కిన జాతీయ గీతం

కళల్లో లీఫ్ ఆర్ట్ భిన్నమైందని అంటోంది తృప్తి. ఆకుపైన చిత్రాలను రూపొందించడం ఈ కళ ప్రత్యేకతని చెబుతోంది. ఆకు మిగతా భాగాన్ని అంతా కట్ చేసి, కేవలం కావాల్సిన చిత్రాన్ని తయారుచేయడమే లీఫ్ ఆర్ట్స్​. ఇండియా బుక్ ఆఫ్​ రికార్డ్​లో చోటు దక్కడం చాలా ఆనందంగా ఉందని తృప్తి మంజునాథ చెబుతోంది. ప్రస్తుతానికి ఊపాధ్యాయ వృత్తిని ఎంచుకుంది ఈ యువతి. ఎవరైనా లీఫ్ ఆర్ట్ నేర్పించమని వస్తే కచ్చితంగా నేర్పిస్తానని చెబుతోంది.

ఇండియా బుక్ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు సంపాదించినతృప్తి మంజునాథ

"అన్ని రకాల కళాకృతులను గీస్తా. పువ్వులు, జంతువులు, జాతీయ గీతం ఇలా రకరకాల చిత్రాలను ఆకులపై తీర్చిదిద్దాను. 8 ఆకులను జాతీయ గీతం రాయడానికి ఉపయోగించా. కరోనా సమయంలోనే లీఫ్​ ఆర్ట్​ను నేర్చుకున్నా. కుటుంబ సభ్యులు నాకు ఎంతగానో సహాయం చేశారు. "

-తృప్తి మంజునాథ

ఇవీ చదవండి:153 దేశాల వార్తాపత్రికల సేకరణ.. వరించిన గిన్నిస్​ వరల్డ్​ రికార్డు

ఒకరితో నిశ్చితార్థం.. మరొకరితో ప్రేమ​.. ఇద్దరు బిడ్డలు పుట్టాక ఒకే వేదికపై పెళ్లి

ABOUT THE AUTHOR

...view details